ETV Bharat / lifestyle

ఆర్మాన్‌... అమ్మల ఆత్మీయ నేస్తం! - aarman foundation for pregnant women welfare latest news

ప్రాణాలు పోసిన డాక్టర్‌ని రోగులు గుర్తుపెట్టుకోవడం మామూలు విషయమే.. కానీ ఇక్కడ ఓ డాక్టర్‌ తాను వైద్యం అందించిన పేషెంట్‌ని ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది.. ఆ పేషెంట్‌ని కానీ ఆమె గుర్తుపెట్టుకోకపోయుంటే లక్షలాదిమంది తల్లీబిడ్డల ప్రాణాలు ఏమయ్యేవో! ఆ డాక్టర్‌పేరు అపర్ణాహేగ్ఢే. అంతర్జాతీయ యూరోగైనకాలజిస్టుగా పేరొందిన ఆమెకు తన వృత్తిలో ఎదురైన ఓ విషాదమే.. ‘ఆర్మాన్‌’ అనే సంస్థకు ప్రాణం పోసేలా చేసింది. 16 రాష్ట్రాల్లో లక్షలమంది ఆరోగ్య కార్యకర్తలతో కలిసి పనిచేస్తుందీ సంస్థ.

ఆర్మాన్‌... అమ్మల ఆత్మీయ నేస్తం!
ఆర్మాన్‌... అమ్మల ఆత్మీయ నేస్తం!
author img

By

Published : Sep 21, 2020, 11:59 PM IST

రాత్రి ఒంటిగంట.. డాక్టర్‌ అపర్ణకి ఎమర్జెన్సీ కాల్‌ వచ్చింది. నెలలు నిండిన ఓ గర్భిణికి వైద్యం అందించాలనేది ఆ కాల్‌ సారాంశం. పరుగున వెళ్లారామె. పేషెంట్‌ పేరు అరుణ. పాతికేళ్లు ఉంటాయి. ముంబయిలోని మురికివాడ నుంచి వచ్చింది. సమస్య ఏంటంటే... బిడ్డ తల బయటకు వచ్చింది. శరీరం మాత్రంలోపలే ఉండిపోయింది. చూస్తే... అప్పటికే ఆ బిడ్డ చనిపోయింది. తల్లినైనా రక్షించాలనుకున్న ఆ డాక్టర్‌ ప్రయత్నాలు ఫలించలేదు. మూడురోజుల తరువాత ఆమె చనిపోయింది. ఆ తల్లీబిడ్డల ముఖాల్ని ఎన్నిరోజులైనా మర్చిపోలేకపోయింది డాక్టర్‌ అపర్ణ.

వాస్తవానికి ఆమె చిన్నాచితకా డాక్టరేం కాదు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుంది. క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌లో అత్యున్నత ఫెలోషిప్‌లూ అందుకుంది. అంతర్జాతీయ యూరోగైనకాలజిస్టుగా ఎంతో పేరుంది. ముంబయిలోని కామా ఆసుపత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేవారు. అలాంటి ఆమెను ఈ సంఘటన కలచివేసింది. ‘అరుణ గర్భం దాల్చాక డయాబెటిస్‌ బారిన పడింది. ప్రసవం వరకూ ఒక్కసారి కూడా తను ఆసుపత్రి ముఖం చూడలేదు. వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ తరువాతా అరుణ లాంటివాళ్లు చాలామందే ఎదురయ్యారు నాకు. స్టడీ చేస్తే.. మనదేశంలో ప్రతిగంటకీ నలుగురు తల్లీబిడ్డలు చనిపోతున్నారు.

ఎందుకని ఆరాతీస్తే... ప్రధానంగా మూడు కారణాలు కనిపించాయి. ఒకటి... సరైన సమయంలో వైద్యం అందకపోవడం. రెండు గ్రామాల్లో ఉండేవారికి రవాణా సదుపాయం లేకపోవడం. మూడోది ఆసుపత్రుల్లో సౌకర్యాల కొరత, కౌన్సెలింగ్‌ అందకపోవడం. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని తపన పడుతున్న సమయంలో...నాకో దారి దొరికింది. ఓసారి వైద్యసేవలు అందించడానికి కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లా. అక్కడ ఎవరికీ టాయిలెట్లు లేవు కానీ అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. అప్పుడే అనుకున్నా ఫోన్‌ సాయంతో తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడకూడదూ?.. అని. అలా 2008లో ఆర్మాన్‌ సంస్థ పుట్టిందంటారు డాక్టర్‌ అపర్ణ.

16 రాష్ట్రాల్లో... మొబైల్‌ మిత్ర

వైద్య సేవలు అందని మారుమూల ప్రాంతాలకు కూడా మొబైల్‌తో వైద్యాన్ని చేరువచేయాలనుకున్నారు అపర్ణ. అందుకు నాందిగా ఎమ్‌మిత్ర అంటే మొబైల్‌మిత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారామె. ఇది ఉచిత ఫోన్‌కాల్‌ సర్వీస్‌. గర్భిణులకు ఆ తొమ్మిదినెలలూ ఫోన్‌కాల్‌ ద్వారా కావాల్సిన సమాచారం స్థానిక భాషల్లో అందుతుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే... ఆ కాల్‌సెంటర్‌ నుంచి వైద్య సలహాలు, నేరుగా సేవలు కూడా అందుకోవచ్ఛు బిడ్డకి ఏడాది వచ్చేవరకూ కూడా ఈ మొబైల్‌ సేవలు అందుతాయి. దేశంలోని వంద ప్రభుత్వ ఆసుపత్రులు, 43 స్వచ్ఛంద సంస్థలతో కలిసి నెట్‌వర్క్‌ని ఏర్పరుచుకున్న ఆర్మాన్‌ ఎప్పటికప్పుడు గర్భిణుల సమాచారాన్ని నమోదు చేస్తుంది. వారికి కావాల్సిన సాయం అందిస్తుంది.

ఇప్పటివరకూ తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవైలక్షలమంది మహిళలు ఈ సేవలని అందుకున్నారు. అలాగే గ్రామాల్లో ఎంపిక చేసిన కొంతమంది మహిళలకు ఆరోగ్యసఖి శిక్షణ అందిస్తుంది ఆర్మాన్‌. వీళ్లు ఇంటి దగ్గరే గర్భిణులకు రక్తపరీక్షలు, బీపీ, ఫీటల్‌ డాప్లర్‌ వంటి పరీక్షలు చేస్తారు. ఇలా సేకరించిన వివరాల్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా వైద్యులకు అందచేస్తారు. ఇందులో తీవ్రమైన సమస్యలున్నవారిని ఆసుపత్రులకు చేరేటట్టు ఆర్మాన్‌ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇలా ఇంటిదగ్గరే టెస్టులు చేసినందుకుగానూ కొంతరుసుం తీసుకుంటారు ఆరోగ్యసఖి కార్యకర్తలు. ఈ రకంగా మహిళలకు ఉపాధినందించే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్‌ అపర్ణ. ఆర్మాన్‌ ప్రారంభించిన మరో కార్యక్రమం ఫోన్‌ సఖీ. ఇది మహారాష్ట్రలో పనిచేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఒక ఆసుపత్రి నుంచి మరొక చోటుకి తిరుగుతూ ప్రాణాలమీదకు తెచ్చుకోకుండా చూస్తుందీ ఫోన్‌సఖీ సేవ.

స్కోల్‌ అవార్డుని అందుకుని..

లాక్‌డౌన్‌ సమయంలో అనేకమంది గర్భిణులు మందులు, వైద్య సేవలు అందక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో ఆర్మాన్‌ చురుగ్గా పనిచేసింది. ఎనిమిది లక్షలమంది ఆరోగ్యకార్యకర్తలకు శిక్షణ అందించింది. ఫోన్‌కాల్స్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ సదుపాయాలతో లక్షలాది మంది గర్భిణులకు చేరువై వారికి కష్టం రాకుండా చూసుకుంది. ఆర్మాన్‌ తరఫున వర్చువల్‌ వైద్యసేవలు అందిస్తూ డాక్టర్‌ అపర్ణ సహా అనేక మంది డాక్టర్లు వీడియోకాల్స్‌ ద్వారా గర్భిణులకు వైద్యం అందించారు.

తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం కృషిచేస్తున్న ఆర్మన్‌ సంస్థ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక స్కోల్‌ అవార్డుని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏడువందల సంస్థలు ఇందుకోసం పోటీపడితే ఆసియా నుంచి మొదటిసారి ఆర్మాన్‌ ఈ అవార్డుని అందుకోవడం విశేషం. సుమారుగా పదకొండుకోట్ల రూపాయలని ప్రైజ్‌మనీగా అందుకుంది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.