వ్యాయామం శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. కసరత్తుతో అలసట ఆలోచనల మీదా ప్రతిఫలిస్తుందనీ ఫలితంగా సరైన నిర్ణయాలు తీసుకోలేరనీ వాళ్లు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు 37 మంది అథ్లెట్లను ఎంపికచేసి వాళ్లతో క్రమబద్ధమైన వ్యాయామంతోబాటు మూడువారాలపాటు అదనంగా మరో 40 శాతం సైక్లింగ్, రన్నింగ్ వంటివి చేయించారట. ఆపై వాళ్ల ఎమ్మారై స్కాన్‌ని పరిశీలించగా- మెదడులోని కొంతభాగం చురుకుదనాన్ని కోల్పోయినట్లు గుర్తించారు. దాంతో వ్యాయామం మితిమీరితే ప్రణాళికాబద్ధంగా ఆలోచించలేకపోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇతరత్రా ప్రవర్తనాలోపాలు తలెత్తే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. సో, అతి ఎందులోనూ మంచిది కాదన్నమాట!
ఇదీ చదవండి:కుక్క ఉంటే గుండె పదిలం