గుడ్డులో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. దీంతో రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు అంత ఎక్కువగా ఏమీ పెరగటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో కేలరీలు తక్కువ. పైగా చాలాసేపటి వరకు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఫలితంగా త్వరగా ఆకలి వేయదు. ఇలా ఇది పరోక్షంగా బరువు తగ్గటానికీ తొడ్పడుతుందన్నమాట.
- కణాల పనితీరు, వాటి ఎదుగుదల, శక్తిని అందించటంతో పాటు శరీరంలో జరిగే పలు జీవక్రియలకు అవసరమైన పోషకాలు గుడ్డుతో లభిస్తాయి.
- దీని పచ్చసొనలోని ఐరన్ మన శరీరం తేలికగా గ్రహించటానికి అనువుగానూ ఉంటుంది.
- గుడ్డులోని ల్యూటీన్ అనే యాంటీ ఆక్సిడెంటు కంటి జబ్బుల ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండటానికీ ఇది దోహదం చేస్తుంది.
- రోజుకు ఒక గుడ్డు తినేవారిలో పక్షవాతం ముప్పు 12 శాతం వరకు తగ్గుతున్నట్టు ఒక పరిశోధనలో వెల్లడైంది.
ఇదీ చూడండి: బన్నీతో నటన చాలా సులభం: రష్మిక