ETV Bharat / lifestyle

పాలిచ్చే తల్లులూ.. కాస్త కంఫర్టబుల్‌గా, కాస్త స్టైలిష్‌గా..! - eenadu stories

ఇటీవలే తల్లైన సువిధకు చీర కట్టుకోవడం అస్సలు రాదు.. పైగా అందులో చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటుంది. అయినా బయటికి వెళ్లినప్పుడు తన బుజ్జాయికి పాలివ్వడం కోసం కష్టమైనా సరే చీరే ధరిస్తుంది. వసుధకు మూడు నెలల పాప ఉంది. బయటికి వెళ్లినప్పుడు తన చిన్నారికి పాలివ్వడానికి చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటుందామె. కారణం.. చుడీదార్స్‌, లాంగ్‌ ఫ్రాక్స్‌.. ఇలా ఆమె ధరించే దుస్తులే...!

పాలిచ్చే తల్లులూ.. కాస్త కంఫర్టబుల్‌గా, కాస్త స్టైలిష్‌గా..!

author img

By

Published : Mar 16, 2021, 3:24 AM IST

ఇలా పాలిచ్చే తల్లుల్లో చాలామంది తమకు నచ్చినా నచ్చకపోయినా చీరలు ధరించడం మనం చూస్తూనే ఉంటాం. పైగా బయటికి వచ్చినప్పుడు ఈ దుస్తుల్లో కొంతమంది అసౌకర్యానికి సైతం గురవుతుంటారు. ఇంకొంతమందేమో స్టైలిష్‌గా కనిపించాలన్న ఉద్దేశంతో మోడ్రన్‌ దుస్తులు ఎంచుకొని తిప్పలు పడుతుంటారు. మీరు కూడా ఇంతేనా? పిల్లలకు పాలిచ్చే క్రమంలోనూ ఫ్యాషనబుల్‌గా, కంఫర్టబుల్‌గా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం అందుకు బోలెడన్ని ఆప్షన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నర్సింగ్‌ బ్రా మొదలు ట్యాంక్‌ టాప్స్‌ దాకా, క్యాజువల్స్‌ దగ్గర్నుంచి ఫార్మల్స్‌ దాకా.. ఇటు స్టైలిష్‌గా, అటు కంఫర్టబుల్‌గా ఉండే అవుట్‌ఫిట్స్‌/లో దుస్తులు న్యూ మామ్స్‌ మనసు దోచేస్తున్నాయి. మరి, అలాంటి కొన్ని ఫ్యాషనబుల్‌ నర్సింగ్‌ వేర్‌ గురించి తెలుసుకుందాం రండి.

ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా పిల్లలకు పాలిచ్చే క్రమంలో సౌకర్యవంతంగా ఉండే అవుట్‌ఫిట్స్‌ ధరించేందుకే ప్రాధాన్యమిస్తుంటారు కొత్తగా తల్లైన మహిళలు. అయితే అప్పుడప్పుడూ ఫ్యాషన్‌ పేరుతో మనం ధరించే కొన్ని రకాల దుస్తులు పాలిచ్చేటప్పుడు మాత్రం అసౌకర్యానికి గురిచేస్తాయి. అలాంటి వారు అటు స్టైలిష్‌గా, ఇటు కంఫర్టబుల్‌గా మెరిసిపోయేందుకు ప్రస్తుతం మార్కెట్లో విభిన్న నర్సింగ్‌ అవుట్‌ఫిట్స్‌ అందుబాటులో ఉన్నాయి.

నర్సింగ్‌ బ్రా గురించి తెలుసా?

మనం ఎలాంటి దుస్తులు ఎంచుకున్నా లో దుస్తులు ధరించడం కామన్‌. అయితే ఈ క్రమంలో సాధారణ బ్రాలను ఎంచుకుంటే పాలివ్వడానికి కాస్త అసౌకర్యంగానే ఉంటుంది. కాబట్టి ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన నర్సింగ్‌ బ్రాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి రొమ్ము భాగాల్లో ప్రత్యేకంగా జిప్స్‌, బటన్స్‌, హుక్స్‌, క్లిప్స్‌.. వంటివి అమరి ఉంటాయి. దీంతో మీరు ఏవైపు పాలివ్వాలనుకుంటున్నారో.. ఆ వైపు బటన్‌ ఓపెన్‌ చేసి కంఫర్టబుల్‌గా పాలివ్వచ్చు.. మరోవైపు రొమ్ము భాగం కనిపిస్తుందన్న భయమే అక్కర్లేదు. అయితే ఇలాంటి నర్సింగ్‌ బ్రాల గురించి కొంతమందికి తెలిసినప్పటికీ వాటిపై ధరించే అవుట్‌ఫిట్స్‌ మరీ బిగుతుగా ఉండేలా ధరించి అసౌకర్యానికి లోనయ్యే వారూ లేకపోలేదు. అందుకే నర్సింగ్‌ బ్రాలతో కంఫర్టబుల్‌గా ఉండాలంటే పై నుంచి వేసుకునే దుస్తులు వదులుగా ఉండేలా జాగ్రత్తపడాలి. అప్పుడే చిన్నారికి మరింత సౌకర్యవంతంగా పాలివ్వడం వీలవుతుంది. అలాగే మీరూ అసౌకర్యానికి గురికాకుండా ఉంటుంది.

Breastfeedingfashionsgh650-5.jpg
నర్సింగ్‌ బ్రా గురించి తెలుసా?

ట్యాంక్‌ టాప్‌తో కంఫర్టబుల్‌గా!

టాప్స్‌, లాంగ్‌ ఫ్రాక్స్‌, కుర్తీస్‌.. ఇలా ఏది ఎంచుకున్నా వాటికి జతగా ధరించే లో దుస్తుల విషయంలో మరో ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. అదే ట్యాంక్‌ టాప్‌. అయితే కొంతమంది కేవలం వీటిని మాత్రమే ధరిస్తుంటారు. ఇలా అయితే బయటికి వెళ్లినప్పుడు అసౌకర్యంగా ఉంటుందనుకునే వారు వీటిపై నుంచి వదులుగా ఉండేలా మీకు నచ్చిన దుస్తుల్ని ధరించచ్చు. లేదంటే వీటి లోపల నర్సింగ్‌ బ్రా వేసుకున్నా సరిపోతుంది. అయితే ట్యాంక్‌ టాప్‌లోనూ వి-నెక్‌, చంకల కింద కాస్త వెడల్పాటి ఓపెన్‌ ఉన్నట్లుగా ఉండే తరహావి ఎంచుకుంటే పాలివ్వడానికి కంఫర్టబుల్‌గా ఉంటుందంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. ఇలా ఉన్న ట్యాంక్‌ టాప్‌తో మీ నడుమును, ఎద భాగాన్ని బయటికి కనిపించకుండా దాచేయచ్చు.

Breastfeedingfashionsgh650-3.jpg
ట్యాంక్‌ టాప్‌తో కంఫర్టబుల్‌గా!

‘ర్యాప్‌’ చేసేయండి!

పాలు తాగే పసి పిల్లలు ఉన్న తల్లుల్లో చాలామంది అలా షికారుకు వెళ్లడానికి వెనకాడుతుంటారు. కారణం నలుగురిలో తన చిన్నారికి పాలివ్వడానికి మొహమాటపడడమే.. అలాగే ఈ క్రమంలో వారు ధరించే దుస్తులు సైతం ఇందుకు మరో కారణంగా చెప్పచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో కంఫర్టబుల్‌గా మీ చిన్నారికి పాలిస్తూనే, స్టైలిష్‌గా మెరిసిపోవాలంటే ‘ర్యాప్‌’ తరహా డ్రస్సులు చక్కటి ఎంపిక. షర్ట్‌లా వేసుకునే ఈ తరహా అవుట్‌ఫిట్‌ను ఒక లేయర్‌పై నుంచి మరో లేయర్‌ను దీనికి అనుసంధానమై ఉన్న బెల్టుతో ర్యాప్‌ చేసి కట్టిపడేయచ్చు. ఇక ఇలాంటి అవుట్‌ఫిట్‌కు ఇందాక చెప్పుకున్నట్లుగా ట్యాంక్‌ టాప్‌ లేదా నర్సింగ్‌ బ్రా జతచేస్తే కంఫర్టబుల్‌గానూ ఉంటుంది. అంతేకాదు.. పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా కుర్తీస్‌, లాంగ్‌ ఫ్రాక్స్‌.. వంటి వాటికి ముందు భాగంలో బటన్స్‌ ఉండేలా కూడా డిజైన్‌ చేస్తున్నారు డిజైనర్లు.

Breastfeedingfashionsgh650-4.jpg
ట్యాంక్‌ టాప్‌తో కంఫర్టబుల్‌గా!

పీసెంట్‌ టాప్‌తో పర్‌ఫెక్ట్‌ లుక్‌!

జీన్స్‌పైకి టీషర్ట్స్‌, క్రాప్‌టాప్స్‌, షర్ట్స్‌.. వంటివి ధరించడం కామనే! అయితే టీషర్ట్స్‌, క్రాప్‌టాప్స్‌ పిల్లలకు పాలిచ్చే క్రమంలో అంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు పీసెంట్‌ టాప్‌ను జీన్స్‌/ట్రౌజర్‌కి జతచేస్తే అటు కంఫర్టబుల్‌గా, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవచ్చంటున్నారు ఫ్యాషనర్లు. కాస్త వదులైన క్రాప్‌ టాప్‌లా ఉండే దీన్ని ధరించడంతో పాటు ట్యాంక్‌ టాప్‌, నర్సింగ్‌ బ్రా.. వంటివి లోదుస్తులుగా ఎంచుకుంటే ఎక్కడున్నా పిల్లలకు పాలివ్వడం ఈజీ అయిపోతుంది. ఈ టాప్స్‌ ధరించినప్పుడు ఒకవైపు టాప్‌ పైకెత్తి పాలిచ్చినా మరోవైపు కనిపించకుండా కవర్‌ చేసేయచ్చు. పైగా వెడల్పాటి నెక్‌ ఉన్న పీసెంట్‌ టాప్స్‌ కూడా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. కాస్త లావుగా ఉన్న వారు ఇలాంటివి ఎంచుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది.

Breastfeedingfashionsgh650-1.jpg
పీసెంట్‌ టాప్‌తో పర్‌ఫెక్ట్‌ లుక్‌!

ఇవి గుర్తుంచుకోండి!

* ఏ దుస్తులు వేసుకున్నా నలుగురిలో బిడ్డకు పాలివ్వాలంటే అసౌకర్యంగా ఉంటుందనుకునే వారు తాము ధరించిన దుస్తులకు మ్యాచయ్యేలా పై నుంచి స్కార్ఫ్‌ వేసుకోవచ్చు. ఇది ఫ్యాషన్‌ కోషెంట్‌ని మరింతగా పెంచేస్తుంది. అలాగే పాలిచ్చే క్రమంలో ఈ స్కార్ఫ్‌తో మీ వక్షోజాల్ని కూడా కవర్‌ చేసుకోవచ్చు.

* ఇలా మీరు ఏ నర్సింగ్‌ ఫ్యాషన్‌ని ఎంచుకున్నా సరే.. నర్సింగ్‌ ప్యాడ్స్‌ని ధరించడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒకవేళ రొమ్ముల్లో నుంచి పాలు లీకైనా వాటిని ఇవి పీల్చేసుకుంటాయి. తద్వారా ఎలాంటి అసౌకర్యమూ ఉండదు.

* ఫ్యాషన్‌ పేరుతో మరీ ఎక్కువ లేయర్లు, ఫ్రిల్స్‌, రఫుల్స్‌.. తరహాలో ఉన్న దుస్తులు ధరించినా పాలివ్వడానికి అస్సలు కంఫర్టబుల్‌గా ఉండదు. కాబట్టి నర్సింగ్ మామ్స్‌ ఇలాంటి ఫ్యాషన్లకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

సో.. ఇవండీ పాలిచ్చే తల్లులు ఇటు స్టైలిష్‌గా, అటు సౌకర్యవంతంగా మెరిసిపోవాలంటే ధరించాల్సిన కొన్ని నర్సింగ్‌ ఫ్యాషన్స్‌! మరి, ఇవి కాకుండా మీకు తెలిసిన ఇతర నర్సింగ్‌ వేర్‌, న్యూ మామ్స్‌ డ్రస్సింగ్‌ టిప్స్‌ ఏవైనా ఉంటే ఈటీవీ భారత్​ వేదికగా పంచుకోండి.. నలుగురికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పండి..!

ఇదీ చూడండి: చిన్నారులకు ఇవి పెట్టేటప్పుడు జాగ్రత్త..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.