బహమాస్‌లోని పిగ్ బీచ్‌లో పందులతో కలిసి ఈత కొడుతూ... జలకాలాటలలో అని పాడుకుంటారు. చుట్టూ అందమైన కొండలూ... తెల్లటి ఇసుకతో నీలాల నీళ్లతో ఉండే ఆ సాగరం పర్యటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. సముద్రంలో వెళ్లే ఓడల్లోంచి ఎవరైనా వేసే ఆహార పదార్థాల్ని తిని బతికే అక్కడి పందులకు ఈత బాగా వచ్చు. దీంతో వాటితో కలిసి నీళ్లలో ఆడుకోవడానికీ, ఈత కొట్టడానికీ జనం ఆసక్తి చూపుతున్నారు. అక్కడి ప్రభుత్వం దాన్నో పర్యటక ఆకర్షణగా మార్చింది. ‘రండి, పందులతో కలిసి జలకాలాడండి’ అని ఆహ్వానిస్తోంది..!
ఇదీ చదవండి: చంకలో పిల్లిని పెట్టుకెళ్లొచ్చు తెలుసా..!