తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తంగడపల్లి శివార్లలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మృతురాలు సిక్కిం రాష్ట్రానికి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మహిళ ప్రియుడు, అతని బంధువు కలిసి హత్యకు పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఘటన సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలు, చరవాణుల సంకేతాల ఆధారంగా నిందితులు.. మహిళ మృతదేహాన్ని తరలించిన కారును గుర్తించారు. కారు అద్దెకు తీసుకున్నట్టు గుర్తించి ఆ సమయంలో సమర్పించిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు.
అయితే హత్యకు గురైన మహిళకు వివాహమై.. ఇద్దరు పిల్లలున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడితో ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడం వల్ల పథకం ప్రకారమే ఆమెను హత్య చేసి.. నగరంలో ఉన్న బంధువు సహాయంతో మృతదేహాన్ని తంగడపల్లికి తరలించి అక్కడ పడేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనాపై పోరుకు రామోజీరావు రూ.20 కోట్ల విరాళం