తన భర్త వెంకన్న ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం నిమ్మలవలసకు చెందిన బెవర వెంకటరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఏ.రాముతో పాటు చిననడిపల్లి గ్రామానికి చెందిన బి.అప్పలరాజును అరెస్టు చేయాలని కోరారు. నవంబర్ 1న రాముతో వెంకన్న గొడవ పడ్డాడు. తనను కులం పేరుతో దూషించావని... దీనిపై జైలుకు పంపిస్తామనంటూ రాముతో పాటు అప్పులరాజు వెంకన్నను మానసికంగా వేధించారు. మనస్తాపానికి గురైన వెంకన్న ఈ నెల 8న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని చికిత్సా నిమిత్తం కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చీపురుపల్లి ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.
పోలీస్ స్టేషన్ ముట్టడి
వెంకన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్థులు చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ప్రాణం పోయేలా ప్రేరేపించిన వారిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: