ETV Bharat / jagte-raho

రూ.6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో

మ్యూటేషన్ కోసం రూ.6 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో పట్టుబడిన ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కొత్తకోట పంచాయతీ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న అనిశా అధికారులు వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు.

రూ.6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో
రూ.6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో
author img

By

Published : Oct 6, 2020, 9:11 PM IST

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కొత్తకోట పంచాయతీ రాజులు భట్టుపాలెం గ్రామానికి చెందిన చిరంజీవి రాజు, సాయి సురేష్​... గత నెల 18, 19 తేదీల్లో పట్టాదారు పాస్ బుక్​లో తమ భూమి వివరాలు నమోదు కోసం మ్యూటేషన్, 1బీ కోసం మీ సేవలో దరఖాస్తు చేశారు. అప్పటి నుంచి వీఆర్వో జి. వెంకటరమణ లంచం డిమాండ్ చేశాడని దరఖాస్తుదారులు ఆరోపించారు. పని పూర్తి కావాలంటే తొలి విడతగా రూ.3 వేలు, పని అయిన తర్వాత మరో రూ.3 వేలు మొత్తం రూ. 6000 చెల్లించాలని అడిగినట్టు చెప్పారు.

ఒకేసారి మొత్తం చెల్లించాలి..

వారం కిందట మరోసారి వీఆర్వోని కలిస్తే ఒక్కసారే రూ.6,000 చెల్లించాలని లేకపోతే మ్యూటేషన్​కు సంబంధించిన ఫైల్ రిజెక్ట్ చేస్తామని ముక్తకంఠంతో బదులిచ్చాడని బాధితులు తెలిపారు. ఫలితంగా దిక్కు తోచని స్థితిలో బాధితులు అనిశా అధికారులను ఆశ్రయించామన్నారు.

రూ.6 వేలు స్వాధీనం..

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అనిశా అధికారులు లావేర్ తహసీల్దార్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. వీఆర్వో నుంచి రూ.6 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు.

ఇవీ చూడండి:

పాఠశాలలో చోరీ.. విద్యాకానుక కిట్లు అపహరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.