ETV Bharat / jagte-raho

తెలంగాణ: సరిహద్దుల్లో ఎదురుకాల్పులు...ఇద్దరు మావోయిస్టులు మృతి

author img

By

Published : Sep 7, 2020, 10:54 PM IST

భద్రాద్రి జిల్లాలోని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఎదురుకాల్పులు జరిగాయి. వరుస ఘటనలతో ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలాన్ని కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్ పరిశీలించారు.

maoistmaoist
maoist

మావోయిస్టుల చర్యలు-పోలీసుల ప్రతి చర్యలతో తెలంగాణలోని భద్రాద్రి జిల్లా ఏజెన్సీ అట్టుడుకుతోంది. ఈ నెల 3న దేవల్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్ ఘటనలో ఓ దళ సభ్యుడుని కోల్పోయి కోలుకోకముందే మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తలిగింది. చర్ల మండలం తెలంగాణ -ఛత్తీస్​గఢ్ అటవీ ప్రాంతం వడ్డిపేట-పూసుగుప్ప వద్ద సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ మేరకు భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వివరాలు వెల్లడించారు.

maoist
maoist

కూంబింగ్​ నిర్వహిస్తుండగా

ఆదివారం బంద్​కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. రక్షణ బలగాలు, ప్రజాప్రతినిధులపై ఆకస్మిక దాడులకు పాల్పడేందుకు పథకం రూపొందిస్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇందులో భాగంగా చర్ల ఏరియాలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసు బృందాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మావోయిస్టుల కోసం విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు చెప్పారు.

20నిమిషాల పాటు

ఈ కాల్పులు దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగినట్లు వెల్లడించారు. అనంతరం ఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో ఎస్​బీబీఎల్ తుపాకీ, ఒక పిస్టల్, రెండు కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వరుసగా రెండు ఘటనల్లో ముగ్గురు సభ్యులను కోల్పోయిన మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తలగగా.. పోలీసులు మరోసారి పైచేయి సాధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.