ETV Bharat / jagte-raho

ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం - నాగర్ కర్నూలులో బాలికలపై అత్యాచారం వార్తలు

ఇద్దరు బాలికలపై నలుగురు బాలురు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణలోని నాగర్​కర్నూల్​ జిల్లాలో జరిగింది. అంతేకాకుండా ఈ దురాగతాన్ని సెల్​ఫోన్లలో చిత్రీకరించి విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించారు.

ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం
ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం
author img

By

Published : Jan 4, 2021, 8:45 AM IST

కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం తాగిన నలుగురు బాలురు బెదిరించి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని లింగాల మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. డిసెంబరు 31 వేడుకల్లో భాగంగా 14 నుంచి 16 ఏళ్ల వయసున్న నలుగురు బాలురు పీకల దాకా మద్యం తాగారు. అర్ధరాత్రి ఆ గ్రామంలోని ఓ వితంతువు ఇంటికి వెళ్లారు. ఆమెను భయపెట్టి ఇద్దరు కుమార్తెలపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేకాకుండా ఆ దురాగతాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరించి విషయం బయటికి చెప్పవద్దని హెచ్చరించారు.

నిందితులు తమ వద్ద చిత్రాలు ఉన్నాయని భయపెట్టడం వల్ల ఆ నిరుపేద కుటుంబం ఫిర్యాదు చేసేందుకు సాహసించలేదు. కాగా గ్రామంలో కొందరు వ్యక్తులు పంచాయితీ పెట్టి నిందితుల నుంచి పరిహారం ఇప్పించేలా ఒప్పందం కుదిర్చినట్లు సమాచారం. ఈ విషయమై ఎస్సై కృష్ణయ్యను సంప్రదించగా అత్యాచారంపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

ఇదీ చదవండి: రూ. 10వేలు ఇవ్వడం భారమవుతుందని... రూ.157 కోట్లు పక్కన పడేశారు...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.