ETV Bharat / jagte-raho

క్రికెట్ బెట్టింగ్​లో నష్టం..ఇద్దరి ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం త్యాళ్లూరు గ్రామంలో విషాదం జరిగింది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ భారీగా నష్టపోయిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు ప్రయత్నించగా.. వీరిలో ఒకరు మృతి చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

cricket betting lose
క్రికెట్ బెట్టింగ్​లో నష్టం
author img

By

Published : Nov 11, 2020, 4:00 AM IST

Updated : Nov 11, 2020, 1:18 PM IST

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిన ఇద్దరు యువకులు... ఎలా బయటపడాలో తెలియక చావే శరణ్యమనుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరుకు చెందిన సురేష్‌, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమరయ్య సోమవారం మధ్యాహ్నం బెల్లంకొండలోని రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లారు. దారిలో పురుగుల మందు తాగారు.

క్రికెట్ బెట్టింగ్​లో నష్టం..ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం

క్రికెట్‌ బెట్టింగ్‌లో నష్టపోయామని, బెట్టింగ్‌ నిర్వాహకుడు డబ్బు కోసం ఒత్తిడి తేవడంతో..... చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ బంధువులకు సెల్ఫీ వీడియో పంపారు. బంధువులు ఘటనాస్థలికి వెళ్లి ఇద్దరినీ సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు, అక్కడి నుంచి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సురేష్‌ చనిపోగా, కొమరయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు..

ఇదీ చదవండి

వీడియో వైరల్: 'మేము బతకకూడదా'... అంటూ కుటుంబం సెల్ఫీ వీడియో

Last Updated : Nov 11, 2020, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.