ETV Bharat / jagte-raho

అమ్మా... నీ అనురాగం!

పేగుబంధం ముందు ప్రపంచంలో ఏదీ సాటి రాదు. తల్లి ప్రేమ ఒక్క మనుషుల్లోనే కాదు... జంతువుల్లోనూ కూడా ఉంటుందని పశ్చిమగోదావరి జిల్లాలో ఓ గేదె నిరూపించింది. లేగదూడను ట్రాక్టర్ ఢీకొట్టడంతో...తల్లి దూడ దగ్గరికి వచ్చి కంటతడి పెట్టింది.

Tractor that hit the  Buffalo in west godavari distict
రోడ్డు ప్రమాదంలో లేగదూడకు గాయాలు
author img

By

Published : May 26, 2020, 9:00 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో నడిరోడ్డుపై లేగదూడను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఒక్కసారిగా రోడ్డు పై పడిపోయిన లేగదూడ అరుపులకు దూరంగా ఉన్న తల్లి పరుగు పరుగున వచ్చింది. ఇతర వాహనాలు రాకుండా అడ్డంగా నిలబడింది. కాలు విరిగి అల్లాడుతున్న దూడను చూసి తల్లడిల్లింది. దూడ కాలు విరిగిన పరిస్థితికి... ఆ తల్లి కంటతడి పెట్టింది. నడిరోడ్డుపై ఈ ఘటన అందరి మనసులను కలచివేసింది.

కొంతమంది వెంటనే స్పందించి ఆ లేగదూడను నీడకు చేర్చారు. లేగదూడను తల్లి, మరొక గేదె విడవకుండా ఉండిపోయాయి. స్థానికులు ప్రథమ చికిత్స చేసి వైద్యులకు సమాచారం అందించారు. పాలకోడేరు మండలంలో నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన వేగంతో మట్టి ట్రాక్టర్లు ప్రయాణిస్తున్న కారణంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వాహనాల పై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.