కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండలం రొయ్యూరు పరిధిలోని కృష్ణా నదిలో నలుగురు గల్లంతైన నలుగురిలో.. మిగిలిన ముగ్గురి మృతదేహాలను మధ్యాహ్నం గుర్తించారు.
గత రాత్రి ఆటంకం..
శనివారం రాత్రి చీకటి పడిన కారణంగా.. గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఈ కారణంగా ఆదివారం ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సహాయక చర్యల్లో వీరయ్యతో పాటు కొట్టుకుపోయిన రంజిత్, సూర్య ప్రకాష్, వెంకటేశ్వర్లు మృతదేహాలను గుర్తించారు.
ఉయ్యూరుకు తరలింపు..
మృతదేహాలను ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సీఐ నాగప్రసాద్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.