ETV Bharat / jagte-raho

జల్సాలకు అలవాటు పడి... కటకటాల పాలు - jogipet theft case news

సరదా కోసం బంధువుల ఊరికి వచ్చారు. పగలంతా విందు వినోదాలల్లో మునిగితేలారు. ఇక రాత్రికి ఇంటికి వెళ్లేందుకు చౌరస్తాకు వెళ్లారు. బస్సు కోసం వేచి చూస్తున్న తరుణంలో... తాళం వేసి ఉన్న ఓ దుకాణాన్ని చూశారు. అంతే... వెంటనే తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఆ సొత్తుతో జల్సాలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లొచ్చారు. మిగిలిన ఆభరణాలను విక్రయించే ప్రయత్నంలో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

జల్సాలకు అలవాటు పడి... కటకటాల పాలై
జల్సాలకు అలవాటు పడి... కటకటాల పాలై
author img

By

Published : Dec 19, 2020, 9:44 AM IST

తెలంగాణలో సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి యాభై లక్షల రూపాయల విలువైన నగలు, 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జోగిపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు. పుల్కల్ మండలానికి చెందిన శివ, వట్​పల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన కార్తీక్, వరంగల్​కు చెందిన శంకర్ కలిసి హైదరాబాదులో కూలీ సెంట్రింగ్ పనులు చేసేవారు. ఈనెల 6వ తేదీన ఆ ముగ్గురు బంధువుల ఇంటికి వెళ్లారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం కోసం మరివెళ్లి చౌరస్తాకు చేరుకున్నారు.

ఆ చౌరస్తాలో వెంకటలక్ష్మి నాగరాజ్ దంపతుల దుకాణానికి తాళం వేసి ఉండడాన్ని గమనించారు. వెంటనే... రాత్రి షట్టర్ తాళాలు పగలగొట్టి నాలుగు తులాల బంగారం నగలు వెండి వస్తువులతో పాటు 60 వేల నగదు తస్కరించారు. అందులోని ఓ పుస్తెలతాడు అమ్మగా వచ్చిన డబ్బులతో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేశారు. మిగిలిన ఆభరణాలను జోగిపేట పట్టణంలో విక్రయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అనుమానంగా తిరుగుతుండగా... వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కారు.

ఇదీ చూడండి:

మద్యం మత్తులో విద్యుత్తు స్తంభం ఎక్కాడు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.