తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీ, భాస్కర్ ఎన్‌క్లేవ్‌లో దొంగలు హల్చల్ చేశారు. అయ్యప్ప కాలనీ, శ్రీసాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని మూడు పోర్షన్ల తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. పోర్షన్లన్నీ ఖాళీగా ఉండడంతో దుండగులు వెనుతిరిగారు. వారంక్రితం ఇదే కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని ఊరెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న 4 లక్షలు విలువ చేసే 3 తులాల బంగారు నగలు, కిలో వెండి వస్తువులు, 80 వేల రూపాయల నగదు, 2.5 లక్షల విలువ చేసే ఎల్ఈడీ టీవీ దోచుకుపోయారు. వారంరోజులుగా ఒకే కాలనీలో వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా రాత్రి పూట గస్తీ పెంచాలని కోరారు.
- ఇదీ చూడండి : ఈ దొంగ మామూలోడు కాదు.. బాబోయ్!