ETV Bharat / jagte-raho

తెలంగాణ: పులి కోసం 'అన్వేషణ'... ఎవరూ అడవులకు వెళ్లొద్దు - Tiger wandering in KumaramBhim District news

తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. 20 రోజుల వ్యవధిలో ఇద్దరిని పొట్టనబెట్టుకోవడంతో సమీప గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఎలాగైనా దాన్ని బంధించాలని జనం వేడుకుంటుండగా.. అటవీ అధికారుల చర్యలు ఫలించడంలేదు.

తెలంగాణ: పులి కోసం 'అన్వేషణ'... ఎవరూ అడవులకు వెళ్లొద్దు

author img

By

Published : Dec 3, 2020, 7:07 PM IST

కుమురం భీం జిల్లా దహేగాం మండలం దిగిడ ఆటవీప్రాంతంలో గతనెల 11న పశువులను మేపడానికి వెళ్లిన విగ్నేష్‌ పులి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ దారుణ ఘటన మరువకముందే 20 రోజుల అనంతరం మరొకరు బలయ్యారు. పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల అనే బాలిక పత్తి చేనులో పనిచేస్తుండగా.. మాటువేసి దాడిచేసి నోటకరుచుకుని వెళ్ళింది. ఆమె కేకలు వేయగా చుట్టుపక్కలవాళ్లు అప్రమత్తమై పులిని తరిమేశారు. అప్పటికే నిర్మల ప్రాణాలొదిలింది. గత కొన్నేళ్లుగా బెజ్జూరు, దహేగాం, పెంచికలపేట అటవీప్రాంతంలో పులులు సంచరిస్తూ.. అడపాదడపా కనిపించడం పశువులపై దాడి చేయడం పరిపాటిగా మారింది. ఒకే నెలలో ఇద్దరు మనుషులను చంపడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

తెలంగాణ: పులి కోసం 'అన్వేషణ'... ఎవరూ అడవులకు వెళ్లొద్దు

చిక్కని పులి జాడ

మహారాష్ట్ర నుంచి పులి వచ్చిందని చెబుతున్న అధికారులు.. దాన్ని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడి చేసిన సమీప ప్రాంతంలో బోన్లు, కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి జాడ మాత్రం ఇంకా చిక్కలేదు. పెంచికలపేట అటవీప్రాంతం వైపు పయనించిందని పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు... మహారాష్ట్ర వైపే వెళ్లిందనే నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత కూడా పులి కదలికలు కనిపించినా అవి కాగజ్​నగర్ డివిజన్ పరిధిలోనివి అని అధికారులు చెప్తున్నారు.

బాధిత కుటుంబాలకు పరిహారం..

పులి సంచారంతో భయాందోళనలకు గురవుతున్న ప్రజలకు ధైర్యాన్నిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజాప్రతినిధులు, అధికారులు. పులి దాడిలో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు అందించి, ఒకరికి అటవీశాఖలో ఉద్యోగం కల్పిస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు.

పులి సమీప ప్రాంతాల్లోనే సంచరిస్తుండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా పులిని బంధించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

ఇవీచూడండి: పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.