కల్లుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని సొంత కూతురే హత్య చేసిన ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం తెల్లవారు జామున సోనమ్మను గొంతు నులిమి హతమార్చిన కూతురు ఇందిరమ్మ, మనుమరాలు లక్ష్మి ప్రస్తుతం పరారిలో ఉన్నారు.
హద్నూర్ గ్రామానికి చెందిన డెబ్బై ఏళ్ల సోనమ్మతో కలిసి కూతురు ఇందిరమ్మ(48) మనుమరాలు లక్ష్మి(28) నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి కల్లు తాగేందుకు డబ్బులు ఇవ్వాలని కూతురు, మనుమరాలు ఆమెతో గొడవ పడ్డారు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామంటూ దౌర్జన్యానికి దిగడంతో ఇరుగుపొరుగు సర్ది చెప్పారు. ఉదయం 10 అయినా సోనమ్మ బయటికి రాకపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: