ETV Bharat / jagte-raho

తెలంగాణలో హత్య కేసు: వెలుగులోకి ఆశ్చర్యకర అంశాలు - rangareddy dist news

దిశ ఘటన తర్వాత హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన తంగడపల్లి కేసు విచారణలో ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూస్తున్నాయి. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే మహిళను పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కారులోనే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి.. గొంతు నులిమి హతమార్చినట్టు గుర్తించారు. ఈ కిరాతకంలో కీలకంగా వ్యవహరించిన మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

tangadapally-murder-case-investigation
tangadapally-murder-case-investigation
author img

By

Published : Apr 6, 2020, 7:57 AM IST

తంగడపల్లి హత్య కేసు: వెలుగులోకి ఆశ్చర్యకర అంశాలు

తెలంగాణ.. రంగారెడ్డి జిల్లా తంగడపల్లి పైవంతెన కింద గత నెల 17న గుర్తు తెలియని మహిళ హత్య కలకలం రేపింది. ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో బట్టబయలైంది. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు సమాచారం. వివాహం కాక ముందు నుంచే మహిళ... పరారీలో ఉన్న మరో నిందితుడు ప్రేమలో ఉన్నట్టు తేలింది.

ఎలాగైనా వదిలించుకోవాలి..

ఆమె వివాహం తర్వాత కూడా వీరిద్దరు సన్నిహితంగా మెలిగారు. పెళ్లి చేసుకొని దూరంగా వెళ్లి కొత్త జీవితం ప్రారంభిద్దామని ఒత్తిడి తెచ్చింది. అప్పటికే మరో మహిళకు దగ్గర కావడంతో ఆమెను దూరం పెట్టాడు. అయినా మహిళలో మార్పు రాకపోవడంతో ఎలాగైనా వదిలించుకోవాలనే పథకం ప్రకారమే హత్య చేసినట్టు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు వెల్లడించినట్లు తెలుస్తోంది.

లాంగ్‌డ్రైవ్‌కు వెళ్దామంటూ..

హత్యకు ముందు మహిళను లాంగ్‌డ్రైవ్‌కు వెళదామంటూ నమ్మించి యువకులు కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అనంతరం గొంతు నులిమి హత్యచేశారు. దుస్తులు లేకుండానే మృతదేహాన్ని పైవంతెన కిందకు దించారు. గంట పాటు అక్కడే ఉన్నారు. తలపై బండరాయితో మోది.. రాయి తమ వెంట తీసుకెళ్లారు.

కారు జీపీఎస్​ ఆధారంగా..

నిందితులు అద్దెకు తీసుకున్న కారు జీపీఎస్​ ఈ కేసులో కీలకంగా మారింది. అక్కడి నుంచి ఎనికేపల్లి, ప్రగతి రిసార్ట్స్‌, ప్రొద్దుటూరు మీదుగా.... నార్సింగి ఇంటర్‌ ఛేంజ్‌ నుంచి బాహ్యవలయ రహదారి పైకి ఎక్కారు. ప్రొద్దుటూరు వద్ద లభించిన సీసీ కెమెరా దృశ్యాల ద్వారా ఈ ఇద్దరే నేరానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

పరారీలో ఉన్న నిందితుడు పట్టుబడితే మృతురాలికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.