గుంటూరు జిల్లా నరసరావుపేటలో మార్కులు తక్కువగా వచ్చాయని కుటుంబీకులు మందలించడం వల్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఇటీవలే ఆన్లైన్ పరీక్షలు రాసింది. ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఆ కళాశాల యాజమాన్యం విద్యార్థిని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు.
మనస్తాపంతోనే..
ఈ క్రమంలో మార్కుల తక్కువ రావడంపై బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. మనస్తాపానికి గురైన బాధితురాలు సెప్టెంబర్ 21న కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు వెంటనే గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించారు.
తుదిశ్వాస..
చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు ముప్పాళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.