లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా షాబాద్ సీఐ శంకరయ్య ఇంట్లో రూ. 3 కోట్ల ఆస్తులను అనిశా అధికారులకు గుర్తించారు. ఎల్బీనగర్‌లోని అతని నివాసంలో పలు ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి అనిశా కార్యాలయంలో సీఐ శంకరయ్య, ఏఎస్సై రాజేందర్‌ను విచారించిన అధికారులు.. వారిని కరోనా పరీక్షలు నిమిత్తం కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం తిరిగి నాంపల్లి కార్యాలయంలో విచారించారు.
ఇదీ చదవండి తెలంగాణ: వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి: మందకృష్ణ