గుంటూరు యువతిపై లైంగికదాడి కేసును పోలీసులు ఛేదించారు. కేసులో మరో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ కేసులో మరో ఐదుగురు కూడా ఉన్నారని తెలుస్తోందని ఆయన అన్నారు. నిందితుల నుంచి చరవాణులు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు . కళాశాల యువత కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు.
ఒకరి నుంచి మరొకరికి...
ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సూత్రధారి తెనాలికి చెందిన మణికంఠగా గుర్తించామని.., దీనికోసం అతను పాత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వినియోగించాడని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మణికంఠ తన ఖాతా నుంచి నగ్నచిత్రాలు అప్‌లోడ్ చేశాడని.., వేరే సమయంలో ఇదే అకౌంట్ నుంచి ధనుంజయరెడ్డి అప్‌లోడ్ చేశాడని ఎస్పీ పేర్కొన్నారు. కౌశిక్ షేర్ చేసిన వీడియోలు భాస్కర్‌కు చేరాయని.. తర్వాత మిగతా వారికీ ఒక్కొక్కరిగా ఈ చిత్రాలు చేరాయని తెలిపారు. కేసులో వరుణ్, కౌశిక్, మణికంఠ, ధనుంజయరెడ్డి కీలక నిందితులని ఎస్పీ పేర్కొన్నారు.
50వేలు డిమాండ్..
బాధితురాలికి వీడియోలు పంపి రూ.50 వేలు డిమాండ్ చేశారన్నారు. యువతి బ్యాంకు వివరాలు కోరడంతో మౌనం వహించారని ఎస్పీ తెలిపారు. నిందితులు నగ్నచిత్రాలు చూపించి యువతిని వేధించారని.. తమ కోరికలు తీర్చాలని బ్లాక్‌మెయిల్ చేశారని ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. వీరి కదలికలపై భవిష్యత్తులోనూ నిఘా ఉంటుందని...ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
ఇవీ చదవండి: గుంటూరు రేప్ కేస్: మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు!