తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కొదాడలో దారుణం జరిగింది. తోటి స్నేహితులే.. 13 ఏళ్ల బాలుడిపై ఏడు నెలలుగా అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... క్రికెట్ ఆడదామని చెప్పిన స్నేహితులు ఇన్నాళ్లూ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలుడి ప్రవర్తనలో మార్పు రావడం గుర్తించిన తల్లిదండ్రులు ఆరా తీశారు. బాధితుడు జరిగినదంతా వారికి వివరించాడు. తల్లడిల్లిన బాలుడి తల్లి ఆరుగురు నిందితులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జువైనల్ కోర్టుకు ఐదుగురు... రిమాండ్‌కు ఒకడు!
నిందితులపై ఐపీసీ 377, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఐదుగురు మైనర్లు ఉండగా వారిని నల్గొండలోని జువైనల్ జస్టిస్ బోర్డ్‌కు తరలించారు. మరో నిందితుడిని రిమాండ్ నిమిత్తం పంపినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: