ETV Bharat / jagte-raho

దారి దోపిడీ దొంగలు అరెస్ట్ : డీఎస్పీ - Kurnool Dsp Chidananda Reddy latest News

దారి దోపిడీ దొంగల ముఠాను కర్నూలు జిల్లా నంద్యాల రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులు జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాల్లో కాపు కాసి ఒంటరిగా వెళ్లే వ్యక్తులపై దాడి చేస్తారని తెలిపారు. అనంతరం చరవాణులు, ఇతర వస్తువులను లాక్కెళ్తారన్నారు.

దారి దోపిడీ దొంగలు అరెస్ట్ : డీఎస్పీ చిదానంద రెడ్డి

author img

By

Published : Oct 8, 2020, 11:53 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో దోపిడీ దొంగతనాలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బాధితులు సదరు దోపిడీ దొంగల ముఠాపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మొత్తం ఏడుగురు..

విచారణలో భాగంగా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి 4 చరవాణిలు, 2 ద్విచక్ర వాహనాలు సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల వైఎస్​నగర్​కు చెందిన మరాటే సిందే చంద్ర కుమార్ ఈ కేసులో ప్రధాన నిందితుడని నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు. సిందే గతంలో 15 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని వెల్లడించారు.

ఇవీ చూడండి:

యువతిని మోసం చేసిన ఏఆర్​ కానిస్టేబుల్ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.