తెలంగాణ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారిపై పిస్తా హౌస్ సమీపంలో ప్రమాదం జరిగింది. యూ టర్న్ తీసుకుంటున్న లారీని ద్విచక్ర వాహనదారుడు వేగంగా వచ్చి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ పటాన్చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన రాజు, ఆంజనేయులుగా గుర్తించారు.
అయితే తొలుత పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై సందిగ్ధంలో ఉన్నప్పటికీ సీసీ ఫుటేజ్‌లో ద్విచక్ర వాహనదారుడు లారీని ఢీ కొట్టినట్టుగా సీసీ కెమెరాలో రికార్డయింది. మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం