తెలంగాణలో మరో దారుణం జరిగింది. హైదరాబాద్లోని కూకట్‌పల్లి ఎల్లమ్మబండలో... ఐదేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల కాంమాంధుడు అత్యాచారానికి యత్నించాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీలో మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి... తనసోదరుడి ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ రోజు ఉదయం స్థానికంగా ఉండే ఓ ఐదేళ్ల చిన్నారిని మహిపాల్ రెడ్డి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి... తాను ఉండే భవనం మూడవ అంతస్తుపైకి తీసుకెళ్లాడు. గమనించిన స్థానికులు... పైకి వెళ్లి చూసే సరికి ఘోరం జరిగిపోయిందని తెలిపారు. స్థానికులను చూసిన నిందితుడు, అక్కడి నుండి పారిపోయాడు.
అప్పటి నుంచి మహిపాల్ కోసం వెతుకున్న కాలనీ వాసులకు సాయంత్రం కనిపించగా వారు అతడిని పట్టుకుని చితకబాదారు. వారి నుంచి తప్పించుకొని పారిపోతున్న సమయంలో మహిపాల్ కిందపడటం వల్ల తలకు తీవ్ర గాయమయ్యింది. ఘటన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన గంట తర్వాతా.. ఎలాంటి స్పందన లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతున్న వారిని ఉరి తీయాలని స్థానికులు డిమాండ్ చేశారు.