ETV Bharat / jagte-raho

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సబ్​పోస్ట్ మాస్టర్​

అనంతపురం జిల్లా హిందూపురం సబ్​డివిజినల్ పోస్టాపీస్ అవరణంలో ఓ సబ్​పోస్ట్ మాస్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పైస్థాయి అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని మనస్తాపం చెందిన అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలుస్తుంది.

postmaster suicide attempt at hindupu
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సబ్​పోస్ట్ మాస్టర్​
author img

By

Published : Oct 26, 2020, 3:35 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం సబ్​డివిజినల్ పోస్టాపీస్ పరిధిలోని కిరికెర గ్రామ సబ్​పోస్ట్ మాస్టర్​గా మోహన్ కుమార్ పనిచేస్తున్నారు. ఇవాళ హిందుపురం సబ్​డివిజినల్ పోస్టాపీస్ ఆవరణలో మోహన్ కుమార్.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన ఉద్యోగులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పైస్థాయి అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని మోహన్ పేర్కొన్నారు. దీంతో మనస్తాపం చెందిన అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

మోహన్ కుమార్ గతంలో పని చేసిన పోస్ట్ ఆఫీస్​లో కొంత నగదు జమా విషయంలో అవకతవకలు జరిగిందనే విషయంపై విచారణకు పిలిపించామని హిందూపురం సబ్​డివిజినల్ పోస్టాపీస్ పోస్టల్ ఇన్​స్పెక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. అయితే అతను ఇక్కడికి వచ్చి సమాధానం తమకు ఇవ్వలేదు. ఆపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆయన పేర్కొన్నారు.

ఇదీచూడండి:

రైతులను కోలుకోలేని దెబ్బతీసిన ఏలేరు... 37 చోట్ల గండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.