హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్‌ను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం ఆమెను బళ్లారి పోలీసులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని హోస్పేట్ తీసుకెళ్లారు. బళ్లారిలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి న్యాయస్థానంలో ప్రవేశ పెట్టిన అనంతరం తిరిగి ఈరోజు ఉదయం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బంగారంపై పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశచూపిన నౌహీరా షేక్.... వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారు. ఆమెపై తెలుగు రాష్ట్రాలతో పాటు... కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీలో కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు... హీరా గ్రూప్స్ అక్రమాలను గుర్తించారు. కేసులో నౌహీరా షేక్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఇవీ చూడండి: చంద్రయాన్-1కు కొనసాగింపే కానీ... ప్రత్యేకం