ఎదుటి వారి బలహీనత.. నమ్మకమే మోసగాళ్లకు పెట్టుబడి. సరిగ్గా ఇదే సూత్రాన్ని వినియోగించి రూ. కోటిన్నరకు పైగా విలువచేసే బంగారాన్ని మాయం చేశాడు ఓ ప్రైవేట్ బ్రాంచ్ మేనేజర్. బంగారం మీ ఇంట్లో ఉంటే ఏం వస్తుంది.. లాకర్‌లో పెడితే గోల్డ్ కాయిన్ వస్తుందని వినియోగదారులను నమ్మించి బంగారం తీసుకున్నాడు. గోల్డ్ కాయిన్ ఇవ్వాలని బాధితులు కోరితే కుంటి సాకులతో రోజులు గడుపుతూ.. అవకాశం రాగానే ఉడాయించాడు. అనుమానం వచ్చిన బాధితులు సదరు ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ నూతన మేనేజర్‌ను నిలదీశారు. ఆయన తీగ లాగితే.. గోల్డ్ స్కాం గుట్టంతా బయటపడింది. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు.
విజయవాడ పటమటలో జరిగిన ఈ ఘటనపై.. దర్యాప్తు ముమ్మరం చేశారు. వీరబాబు అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. అతణ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సహకరించిన ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తుల నుంచి సుమారు కోటి 90 లక్షల రూపాయల విలువ చేసే బంగారం వీరబాబుకు అందినట్లు గుర్తించారు. ఏడాది నుంచి బంగారం లాకర్‌లో పెట్టాలని మేనేజర్ తమ చుట్టూ తిరుగుతున్నట్లు బాధితులు తెలిపారు. తమ నగదు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: