ETV Bharat / jagte-raho

తాగుబోతుల గొడవ అడ్డుకోవడమై తప్పైంది.... - west godavari

ఇద్దరు వ్యక్తులు మద్యం తాగుతూ గొడవ పడ్డారు. పక్కనే ఉన్న వ్యక్తి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అంతే... కోపంతో రెచ్చిపోయారా ఇద్దరు.

తాడెపల్లిగూడెంలో వ్యక్తి దారుణ హత్య
author img

By

Published : Apr 12, 2019, 12:11 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగుడెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మరొక వ్యక్తి ప్రాణాప్రాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలోని మసీదు సెంటర్​లో సంపత్, జానీ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తూ గొడవ పడ్డారు. పక్కనే ఉన్న చేబ్రోలు వెంకటేశ్వరరావు వారికి సర్ది చెప్పబోయారు. అప్పటికే పూటుగా తాగిన మత్తులో ఉన్న జానీ తన వద్ద ఉన్న సర్జికల్ చాకుతో వెంకటేశ్వరరావుపై దాడి చేశాడు. వెంకటేశ్వరరావు కంఠం తెగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే...

రక్తపు మడుగులో పడిపోయిన వెంకటేశ్వరరావును స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్టు తేల్చేశారు. ఈ ఘర్షణలో జానీ స్నేహితుడు సంపత్‌ కూడా గాయపడ్డాడు. అతన్ని తణుకులోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

లొంగిపోయిన జానీ

తాగినమైకంలో ఇద్దరిపై దాడి చేసి... ఒకరి హత్యకు కారణమైన జానీ... పట్టణ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.

తాడెపల్లిగూడెంలో వ్యక్తి దారుణ హత్య

ఇవీ చూడండి: అనంతలో ఘోర ప్రమాదం-ఏడుగురు మృతి

Intro:..

Body:మద్యం మత్తు ఒక ప్రాణాన్ని బలిగొనడంమే కాకుండా అ మరొక వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. ఇద్దరు వ్యక్తులు మద్యం తాగుతూ గొడవ పడుతూ ఉండగా వారి వారించే ప్రయత్నం చేసినందుకు ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మరొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మసీదు సెంటర్ సెంటర్లో నిన్న అర్ధరాత్రి దాటాక దారుణ హత్య చోటు చేసుకుంది. మద్దుకూరి సంపత్, షేక్ జానీ లు కలిసి మద్యం సేవిస్తూ ఉండగా ఇద్దరి మధ్య గొడవ అ జరిగింది. ఈ క్రమంలో జానీపై సర్జికల్ చాకుతో సంపత్ దాడికి దిగాడు. అది గమనించిన చేబ్రోలు వెంకటేశ్వరరావు@ పిల్లి వెంకన్న అడ్డుకోబోయాడు. దీంతో ఆగ్రహించిన సంపత్ తనతో తెచ్చుకున్న చాకుతో ఇద్దరిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో పిల్లి వెంకన్నకు కంఠం తెగిపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ఘటనలో జానీకి చేతి మణికట్టు వద్ద, మిగతా చోట్ల బలమైన గాయాలు అవ్వడం అతన్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జానీ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అనంతరం సంపత్ తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సిఐ సుభాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.