కృష్ణా జిల్లాకు చెందిన రాములమ్మ కుమార్తె గాయత్రిని అదే ప్రాంతానికి చెందిన సైదారావు వివాహం చేసుకున్నాడు. రాములమ్మ తమ్ముడు పుల్లారావు భార్య అతడిని ఏడాది క్రితం వదిలేసింది. తన కుమార్తెను తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని రాములమ్మ భావించి అల్లుడిని చంపాలని కుమార్తెను వేధించారు. తనను ప్రేమగా చూసే భర్తను చంపేందుకు మనసు ఒప్పక గాయత్రి పురుగుల మందు తాగి తనువు చాలించింది.
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినాథపురానికి చెందిన కత్తి రాములమ్మ కుమార్తె శనివారం ఆత్మహత్య చేసుకుంది. మొదట అందరూ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందేమోనని భావించారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు.. విచారణ చేపట్టగా.. మహిళ రాసిన లేఖ లభ్యమైంది. మహిళ ఆత్మహత్యకు తల్లి, మేనమామ వేధింపులే కారణమని లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని రిమాడ్కు తరలించారు.