శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్న హరిశ్చంద్రపురంలో కోట నాగేశ్వరరావు (41) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. విశాఖపట్నంలో కారు డ్రైవర్గా పని చేస్తున్న నాగేశ్వరరావు సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబంతో కలసి బుధవారమే గ్రామానికి వచ్చాడు. పక్కపక్క ఇళ్లల్లో నివాసముంటున్న చింతాడ అప్పన్న, చింతాడ గోపీల మధ్య బుధవారం రాత్రి మద్యం మత్తులో ఆరు బయట ఘర్షణ జరిగింది. వారిని నిలువరించేందుకు వెళ్లిన నాగేశ్వరరావుపై... అప్పన్న రాయితో దాడిచేశాడు. బాధితుడి ముఖంపై బలంగా గాయాలయ్యాయి.
అపస్మారక స్థితికి చేరిన నాగేశ్వరరావును నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. టెక్కలి సీఐ నీలయ్య గ్రామానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. నాగేశ్వరరావు, అప్పన్న కుటుంబాల మధ్య పాత కక్ష్యలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో గొడవ ఆపేందుకు వచ్చిన నాగేశ్వరరావుపై అప్పన్న దాడి చేశాడని టెక్కలి సీఐ ఆర్.నీలయ్య తెలిపారు.
ఇదీ చదవండి: