ETV Bharat / jagte-raho

ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు..మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు

ప్రేమిస్తున్నాను..నిన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. సీన్​ కట్ చేస్తే మరో యువతితో పరిచయం. అంతే ఏకంగా పెళ్లి పీటలు ఎక్కేశాడు ఓ యువకుడు. అసలు విషయం తెలుసుకున్న బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మోసగాడి అసలు కథను బయటపెట్టారు.

man arrested for cheating young woman in vizianagaram district

author img

By

Published : Feb 15, 2020, 9:48 AM IST

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు అరెస్టు

నిన్నే ప్రేమిస్తున్నాను...పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ప్రియురాలిని మోసం చేయడమే కాకుండా వేరొక యువతిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడిని విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్పీ రాజకుమారిని బాధితురాలు ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. గురువారం రాత్రి డెంకాడ పోలీస్‌ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసి 24 గంటల్లోపే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు

ఈ కేసుకు సంబంధించిన వివరాలను భోగాపురం సీఐ సీహెచ్‌ శ్రీధర్‌, ఎస్‌ఐ ఎస్‌.భాస్కరరావు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాలపాలేనికి చెందిన కముజు బాలాజి(30)... శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఉన్న అరవిందో ఫార్మా పరిశ్రమలో చేరి 2016 నుంచి 2019 వరకు పని చేశాడు. ఆ సమయంలో అక్కడ ఆ యువతి తల్లి క్యాంటీను నిర్వహించేది. అలా పరిచయం ఏర్పరచుకొని డెంకాడ ప్రాంతంలో ఉన్న ఆమె ఇంటికి వెళ్తుండేవాడు. ఒకే కులానికి చెందిన వారు కావడంతో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని నమ్మించి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత విశాఖ జిల్లా పరవాడ వద్ద ఫార్మా పరిశ్రమకు బదిలీ కావడంతో అక్కడికి వెళ్లిపోయాడు. నాలుగు నెలల క్రితం నక్కపల్లి ప్రాంతానికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలియడంతో తాను మోసపోయానని, న్యాయం చేయాలంటూ బాధితురాలు ఎస్పీని ఆశ్రయించింది.

రిమాండ్ కు నిందితుడు

అక్కడినుంచి వచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన డెంకాడ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలా యువతులెవ్వరూ మోసపోకూడదనే ఉద్దేశంతో నిందితునిపై రౌడీషీట్‌ తెరిచినట్లు సీఐ శ్రీధర్‌ తెలిపారు. దిశ చట్టం మాదిరిగానే కేసులు పెట్టి బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు. పెళ్లి పేరుతో మోసగించిన యువకునిపై మోసం, నయవంచన, మానభంగం సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

ఇదీ చదవండి :తాగుడుకు బానిసయ్యాడని కన్నబిడ్డపై కత్తితో తల్లి దాడి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.