తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లికి చెందిన ఓ మహిళ తన అక్కకు రోడ్డు ప్రమాదం జరగటంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్ వైపు వచ్చిన ఆ మహిళను చూసిన విక్కీ అనే యువకుడు.. ఆస్పత్రి అవసరాలకు డబ్బులు ఇస్తానని నమ్మబలికాడు. కలెక్టరేట్ వైపు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
అంతకుముందే తన స్నేహితులకు విక్కీ ఫోన్ చేయటంతో వారు వచ్చారు. 11 మంది మిత్రులు అక్కడికి రాగా అందులో ఐదుగురు ఆ మహిళను అత్యాచారం చేశారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావటంతో యువకులు పరారయ్యారు. కొంతమందిని పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి: