ETV Bharat / jagte-raho

టపాసుల కోసం వెళ్లి బాలుడి అదృశ్యం - సూర్యాపేట జిల్లా వార్తలు

తెలంగాణలోని సూర్యాపేటలో ఐదేళ్ల బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. టపాసుల కోసం దుకాణానికి వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగిరాలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కలకలం సృష్టించిన దీక్షిత్ రెడ్డి అపహరణ, హత్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని... గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

five-years-boy-missing-in-suryapet-district
టపాసుల కోసం వెళ్లి బాలుడు అదృశ్యం
author img

By

Published : Nov 15, 2020, 2:25 PM IST

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐదేళ్ల బాలుడి అదృశ్యం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లిన చిన్నారి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన దీక్షిత్ రెడ్డి అపహరణ, హత్యను దృష్టిలో పెట్టుకున్న సూర్యాపేట పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు.

టపాసుల కోసం వెళ్లి!

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్లో నివాసం ఉంటున్న పరిక పల్లి మహేశ్, నాగలక్ష్మి కుమారుడు ఐదేళ్ల గౌతమ్ ఇంటి సమీపంలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లి తిరిగిరాలేదు. దీపావళి సందర్భంగా టపాసులు కొనడం కోసం దుకాణానికి వెళ్ళిన కుమారుడు ఎంతకీ రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో తల్లిదండ్రులు వెతికినా ఫలితం లేదు. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముమ్మరంగా గాలింపు

కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం సీఐ ఆంజనేయులు సహా మరో ముగ్గురు ఎస్సైలు గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆత్మకూర్ (ఎస్ ) మండలం ఏపూరు గ్రామానికి చెందిన బాలుడి తండ్రి మహేశ్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ.. సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు.

ఇదీ చదవండి:

క్లీనర్‌ను దారుణంగా చంపి... లారీలోనే మృతదేహాన్ని తీసుకొచ్చిన డ్రైవర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.