తెలంగాణలోని నిర్మల్ జిల్లా అనంతపేటలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఓ వ్యక్తి కన్న కూతుర్నే కడతేర్చాడు. వినీష్ అనే వ్యక్తి రోజు మద్యం సేవించి...భార్యతో గొడవపడుతుండేవాడు. శుక్రవారం రాత్రి భార్యతో గొడవపడిన వినీష్... మద్యం మత్తులో కోపంతో కుమార్తె నిత్యను నేలకేసికొట్టాడు. చిన్నారికి బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంలోనే ప్రాణాలు కోల్పోయింది. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: