హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రాజేశ్(60) అనే వ్యక్తి తన భార్య చనిపోవడంతో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య, ఆమె కుమార్తె(20) నాచారం పరిధిలో నివాసముంటున్నారు.
పని నిమిత్తం యువతి... తన సవతి తండ్రి ల్యాప్‌టాప్‌ను తీసుకుంది. దానిని ఆన్ చేయగానే యువతికి ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలు దర్శనమిచ్చాయి. వాటిని చూసిన కుమార్తె కుంగిపోయింది. మంచిగా కనిపించే తన సవతి తండ్రి... ఇంతటి నీచమైన పని చేస్తాడని ఊహించలేకపోయింది. తల్లికి చెప్పలేక తనలో తానే క్షోభను అనుభవించింది.
అనంతరం ధైర్యం చేసి తల్లికి జరిగిన విషయాన్ని చెప్పింది. ఇద్దరు కలిసి నిందితుడిపై నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... పోలీసులు రాజేశ్‌ను అరెస్టు చేశారు. అతనిని జైలుకి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా ఆ ప్రబుద్ధుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతనిని వదిలిపెట్టారు. నిందితుడు వైరస్ నుంచి కోలుకున్నట్లు గుర్తించిన పోలీసులు మరోసారి అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: 'తీవ్రవాదుల్లో చేరతామని.. రాష్ట్రపతి అనుమతి అడుగుతాం'