నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం బయ్యవారి కండ్రిగ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి చెందారు. చిట్టమూరు మండలం ఆలేటిపాడు గ్రామానికి చెందిన మల్లిబాబు... తన కుమారుడు సుబ్రహ్మణ్యంతో కలిసి ద్విచక్రవాహనంపై కొత్తగుంట గ్రామానికి వెళ్లారు. చికెన్ తీసుకుని తిరిగి వస్తుండగా బయ్యవారి కండ్రిగ వద్ద ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పి.. పక్కనే ఉన్న తాటిచెట్టును ఢీకొంది. ఈ క్రమంలో ఈ వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న చిట్టమూరు ఎస్సై కిషోర్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ల మరణంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
చెట్టును ఢీకొన్న బైకు... తండ్రీ కుమారుడు మృతి - నెల్లూరు జిల్లా నేర వార్తలు
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం ఆలేటిపాడు గ్రామంలో విషాదం నెలకొంది. బయ్యావారి ఖండ్రిగ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమారుడు మృతి చెందారు.