ETV Bharat / jagte-raho

తెలంగాణ: రుణం ఇప్పిస్తానని.. లక్ష రూపాయలు మాయం - cyber crime in secundrabadd

తెలంగాణలో.. సైబర్ క్రైమ్​పై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా... బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. తాజాగా.. బ్యాంకు అధికారినంటూ.. గ్రామీణ ఉద్యోగ సంస్థ ద్వారా రుణం ఇప్పిస్తానని ఫోన్​ చేసి... ఓ వ్యక్తి నుంచి లక్షానాలుగు వేల రూపాయలు దోచుకున్న సంఘటన సికింద్రాబాద్​లో చోటుచేసుకుంది.

cyber-crime
cyber-crime
author img

By

Published : Jul 16, 2020, 11:16 PM IST

సికింద్రాబాద్​ ఝాన్సీబజార్​కు చెందిన బబ్లూ అనే వ్యక్తికి... బ్యాంక్​ అధికారినంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్​ అని బబ్లూ నుంచి లక్షా నాలుగు వేల రూపాయలు సదరు వ్యక్తి.. తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.

మోసపోయానని గ్రహించిన సదరు బాధితుడు హైదరాబాద్​ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బబ్లూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అచ్చెన్న బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.