ETV Bharat / jagte-raho

మంచం అమ్మకానికి పెట్టి.. రూ.లక్ష మోసపోయిన మహిళ

ఆన్​లైన్​లో మంచం అమ్మకానికి పెట్టి.. హైదరాబాద్​కు చెందిన మహిళ లక్ష రూపాయలు మోసపోయిన ఘటన బోయిన్​పల్లిలో చోటు చేసుకుంది. ఆన్​లైన్​ అమ్మకంలో మోసపోయానని తెలుసుకున్న ఆమె సైబర్​ పోలీసులను ఆశ్రయించారు.

మంచం అమ్మకానికి పెట్టి.. రూ.లక్ష మోసపోయిన మహిళ
మంచం అమ్మకానికి పెట్టి.. రూ.లక్ష మోసపోయిన మహిళ
author img

By

Published : Jul 23, 2020, 6:04 PM IST

మంచం అమ్మకానికి పెట్టి.. ఓ మహిళ రూ.లక్షా ఐదు వేలు రూపాయాలు పోగొట్టుకున్నారు. హైదరాబాద్ బోయినపల్లికి చెందిన శ్రీదుర్గ ఓఎల్​ఎక్స్​లో మంచం అమ్మకానికి పెట్టారు. ఆ ప్రకటన చూసి.. ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తాను ఆర్మీ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. మంచం నచ్చిందని.. రూ.20వేలకు బేరం కుదుర్చుకున్నాడు. నా చిరునామా మీకు పంపిస్తాను.. మంచం పంపించండి అని నమ్మించాడు. డబ్బులు అన్​లైన్​లో వేస్తానన్నాడు. క్యూఆర్ కోడ్ పంపిస్తాను. దాన్ని స్కాన్ చేస్తే.. డబ్బులు మీ ఖాతాలో పడతాయని నమ్మించాడు. నిజమే అని నమ్మిన శ్రీదుర్గ.. అతను పంపించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారు. క్షణాల్లో ఆమె ఖాతాలోని లక్షా ఐదు వేలు మాయమయ్యాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి స్విచాఫ్​ చేశాడు. మోసపోయానని గుర్తించిన సదరు బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: విశాఖలో బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. ముగ్గురు నిందితుల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.