ETV Bharat / jagte-raho

తస్మాత్ జాగ్రత్త: ఉద్యోగం ఇస్తానని రూ.79 వేలు దోచేశారు.! - హైదరాబాద్​ వార్తలు

సైబర్ క్రైమ్​పై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా... బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. ఉద్యోగం ఇస్తానంటూ ఒకరిని సైబర్​ దొంగలు నిలువు దోపిడీ చేశారు. ఉద్యోగం ఇవ్వాలంటే డబ్బులు కట్టాలని రూ.79వేలు ఖాతాలో వేయించుకున్నారు. అనంతరం స్పందించకపోవడం వల్ల బాధితుడు సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించాడు.

cyber-cheaters-employment-cheating-in-hyderabad

author img

By

Published : Jul 19, 2020, 4:52 PM IST

సైబర్ దొంగలు కొత్త ఆలోచనలతో అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. హైదరాబాద్​ మలక్​పేట్ ఆనందనగర్​కు చెందిన కృష్ణజా ఉద్యోగ వేటలో ఉన్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కృష్ణజాకు ఫోన్ వచ్చింది. జూబ్లీహిల్స్​లోని కలర్స్ ఎంటర్​టైన్​మెంట్ సంస్థలో టీమ్ లీడర్ ఉద్యోగం ఖాళీగా ఉందని... మీరు కోరితే ఆ అవకాశం మీకే ఇస్తానంటూ చెప్పాడు గుర్తు తెలియన వ్యక్తి. కృష్ణజా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.

ఉద్యోగం ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ కోసం ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ ఇలా వివిధ కారణాల పేరుతో 79వేలు ఖాతాలో వేయించుకున్నాడు. ఆ తర్వాత స్పందించడం మానేశాడు. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'అత్యాశే శాపం.. పెరుగుతున్న ఆన్​లైన్​ గేమింగ్​ మోసం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.