ETV Bharat / jagte-raho

ఆ కవలలకు తల్లిని దూరం చేసిన రోడ్డు ప్రమాదం

యాక్సిడెంట్​ అంటే కారో, బైకో... రోడ్డు మీద పడటం కాదు... ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడటం అని ఓ హీరో... సినిమాలో చెప్పిన డైలాగ్​. కానీ ఈ మాటలు నిజమనే చెప్పాలి. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్​ 12 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. కానీ ఆమె మరణం ఎన్నో అనుబంధాలను ఛిన్నాభిన్నం చేసింది.

banjara-hills-accident-etv-bharat-special-story

author img

By

Published : Nov 28, 2019, 3:26 PM IST

ఆ కవలలకు తల్లిని దూరం చేసిన రోడ్డు ప్రమాదం

హైదరాబాద్​ బంజారాహిల్స్​ రోడ్​ నంబర్​ 12లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్లక్ష్యంగా బస్సు నడిపి సోహిని సక్సేనా మృతికి కారణమైన తాత్కాలిక డ్రైవర్​ శ్రీధర్​ను పోలీసులు రిమాండ్​కు తరలించారు. ఆమె మృతి కుటుంబాన్ని ఛిన్న భిన్నం చేసింది.

  1. టాటా చెప్పి బయటకు వెళ్లిన అమ్మను ఎక్కడికి తీసుకెళ్లారు? ఇంటికి రాలేదే? ఎప్పుడొస్తుంది నాన్నా? - మూడేళ్ల వయసున్న ఆ కవల పిల్లలు వచ్చీరాని మాటల తూటాలివి... వీటికి జవాబిచ్చేదెవరు? కన్నుమూసిన తల్లి కోసం కలవరించే బిడ్డలకు ఎలా బదులివ్వాలి? ఏం చెప్పాలన్నా ఉబికి వచ్చే కన్నీటి భాష ఆ పసిహృదయాలకు ఎలా అర్థమయ్యేను?
  2. ‘ఒక్కగానొక్క చెల్లి.... పొద్దున్నే ఫోన్‌ చేసింది. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది... కొన్ని గంటల్లోనే ఆమె లేదన్న వార్త విని ఎలా బతికున్నామో అర్థం కావట్లేదు’... ఇది ఆమె సోదరుడి మనో వేదన.
  3. ఈ మధ్యనే తండ్రిని కోల్పోయాను. పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను నిత్యం ఓదార్చే నా భార్య ఏమైంది? ఒక్కసారిగా నా జీవితంలో ఏమిటీ శూన్యం? ఇద్దరు బిడ్డలు అమ్మను అడుగుతుంటే వారిని ఎలా సముదాయించగలను?’ - ఇది ఆమె భర్త హృదయాక్రోశం.

ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు

టీసీఎస్‌లో పనిచేస్తున్న సోహినీ మంగళవారం ఉదయం తన పిల్లలిద్దర్నీ సమీపంలోని ప్లేస్కూల్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. వారికి టాటా చెప్పి ద్విచక్ర వాహనంపై తాను పనిచేసే సంస్థకు బయలుదేరారు. గమ్యం చేరకముందే ఆర్టీసీ బస్సు రూపంలో ఆమెను మృత్యువు కబళించింది.

అప్పుడు తండ్రి మరణం.. ఇప్పుడు భార్య

ఇద్దరు కవల పిల్లలు అక్షయ్‌, అంకిత్‌ తల్లి మృతదేహం వద్ద.. ‘అమ్మా.. ఇటు చూడమ్మా’ అంటూ దీనంగా వేడుకోవడంతో రోదనలు మిన్నంటాయి. భార్య మరణంతో కుదేలైన వినీత్‌ కుమార్‌ మాథూర్‌ పిల్లలను హత్తుకొని పెద్దపెట్టున రోదించారు. ఫెడరల్‌ బ్యాంకు మేనేజర్‌గా ఉద్యోగ విమరణ చేసిన ఆయన తండ్రి కె.కె.మాథూర్‌ రెండు నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందారు. ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోని వినీత్‌కు భార్య మరణం అశనిపాతమైంది.

ఆదివారం వస్తానని...

సోహినీ సోదరుడి ఆవేదన కూడా అంతులేనిది. మంగళవారం ఉదయమే తనకు సోహినీ ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిందని, ఆదివారం పిల్లలను తీసుకొని ఇంటికొస్తానని చెప్పిందని, ఇంతలోనే ఇలా జరిగిందని ఆమె పెద్ద సోదరుడు రిషికేష్‌ రోదించారు. సోదరి ఇక లేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక వారంతా చిన్నపిల్లల్లా కన్నీరుమున్నీరయ్యారు.

సోహినీ పిల్లలు స్థానికంగా ఉన్న ఓ ప్లేస్కూల్‌లో చదువుతున్నారు. వారిని గీతాంజలి పాఠశాలలో చేర్చేందుకు ఆమె దరఖాస్తు చేసింది. సొహినీ మరణవార్త తెలియని ఆ పాఠశాల నిర్వాహకులు బుధవారం ఉదయం పిల్లలకు ప్రవేశం లభించిందంటూ ఆమె నంబరుకు ఫోన్‌ చేశారు. ఏం సమాధానం ఇవ్వాలో తెలియక తర్వాత మాట్లాడతామని కుటుంబీకులు చెప్పారు. సోహినీ అంత్యక్రియలను పురానాపూల్‌ శ్మశానవాటికలో బుధవారం పూర్తి చేశారు.

TG_HYD_04_28_BANJARAHILLS_ACCIDENT_UPDATE_PKG_3182400 note: :ఫోటోలు డెస్క్ వాట్సప్, తాజా కి పంపాము, TG_HYD_47_27_BANJARAHILLS_ACCIDENT ఫైల్ లోని విజువల్స్ వాడుకోగలరు ( )బంజారాహిల్స్ రోడ్ నం 12 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్లక్ష్యంగా బస్సు నడిపి సోహిని సక్సేనా మృతికి కారణమై తాత్కాళిక డ్రైవర్ శ్రీధర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. మృత దేహానికి పోస్టు మార్టం తర్వాత కుటంబ సభ్యులు పురానా పూల్ లో అంత్యక్రయలు నిర్వహించారు. సోహిని సక్సేనా మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తమకు బాయ్ చెప్పిన అమ్మ ఇప్పుడు నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి ఇద్దరు పిల్లలూ అమ్మ ఇప్పుడు ఎందుకు నిద్ర పోతుందో అర్థంకాని పరిస్థితి. ఏడుస్తున్న మూడేళ్ల కవలలను చూసి అక్కడున్నవారు కళ్లనీళ్ల పర్యంతమవుతున్నారు అన్న పుట్టన రోజుకు పిల్లలను తీసుకొని ఇంటికొస్తాను అన్న సోహిని అనంత లోకాలకు వేళ్ళిపోయింది. వాయిస్ కళ్ల అఫీసుకు వెళ్లిన సోహినీ సక్సేనా మరణం ఆ కుటుంబంలో ఒక కలలా మారింది. రెండు నెలల కిందటే తన తండ్రిని కోల్పోయిన భర్తకు ఇప్పుడు కట్టుకున్న భార్య మరణం అంతులేని ఆవేదనను మిగిల్చింది. సోహిని మృతదేహాన్ని మంగళవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని బంజారా గ్రీన్ కాలనీలోని ఇంటికి తీసుకొచ్చారు . ఆమె మరణవార్త సమాచారం తెలుసుకున్న బంధువులు , కుటుంబ సభ్యులు , సన్నిహితులు , తోటి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బంజారాగ్రీస్ కాలనీకి బుధవారం చేరుకున్నారు . మంగళవారం ఉదయం టీసీఎస్ కు వెళ్లేముందు సోహినీ పిల్లలిద్దరినీ సమీపంలోని ప్లేస్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చింది . పిల్లలిద్దరికీ వీడ్కోలు చెప్పి ద్విచక్రవాహనంపై ఆఫీసు బయలుదేరింది. అలా వెళ్ళన తల్లి శవమై తిరిగి వచ్చింది. ఇది తెలియని కవలలు అక్షయ్ , అంకిత్ లు . . . అమ్మ . అమ్మా . చూడమ్మ మృతదేహం వద్దకు వచ్చి పిలుస్తుండటంతో కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. అమ్మ ముఖం చూపించాలంటూ కుమారుడు కోరడం అందరినీ కంటతడి పెట్టించింది . మరోవైపు భార్య మరణాన్ని తట్టుకోలేని వినీత్ కుమార్ మాథూర్ పిల్లలను హత్తుకొని బిగ్గరగా రోదించాడు. ముగ్గురు మగపిల్లల తర్వాత సోహిని పుట్టడంతో సోదరులు రిషికే, అమరేష్, విశేషన్లు సోదరి సోహిని ని ఎంతో ప్రేమగా చూసుకొనేవారు . అలాంటి వారి సోదరి మృతిచెందడంతో మృతదేహం వద్ద బహన్..బహన్ అంటూ ఏడవడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇదిలా ఉంటే సోహినీ ఇద్దరు పిల్లలు స్థానికంగా ఉన్న ఓ ప్లే స్కూల్లో చదువుతున్నారు. వారి భవిష్యత్తు కోసం ఈ మధ్యనే గీతాంజలి పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసింది . సొహినీ మరణవార్త తెలియని పాఠశాల నిర్వాహకులు బుధవారం ఉదయం పిల్లలకు ప్రవేశం లభించిందంటూ ఆమెకు ఫోన్ చేశారు. వారికి ఏం సమాధానం చెప్పాలో భర్తకు అర్థంకాని పరిస్థితి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.