శ్రీశైలం దేవస్థానంలో జరిగిన దర్శనం, అభిషేకం టికెట్లు గోల్‌మాల్ పై పోలీసు శాఖ విచారణ వేగవంతం చేసింది. రిమాండ్‌లో ఉన్న నిందితులను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చినట్లు కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారి జె.వెంకట్రావు తెలిపారు. 2017లో దేవస్థానం సిస్టమ్స్ అడ్మిన్లుగా ఉన్న దర్శిల్లీ, రూపేశ్... దర్శనం, అభిషేకం టికెట్ల అవినీతికి మార్గం వేశారని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకుల తరఫున పని చేసిన పొరుగు సేవల సిబ్బందితో కలిసి టికెట్ల సొమ్ము స్వాహా చేసినట్లు చెబుతున్నారు. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ల ద్వారా నకిలీ ఐడీలు సృష్టించి అభిషేకం టికెట్లను అక్రమ మార్గంలో అమ్ముకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలుసుకునేందుకు దర్శిల్లీ, రూపేశ్ లను కస్టడీ ద్వారా శ్రీశైలంలో విచారించనున్నారు.
ఇదీ చూడండి: భక్తులకు దర్శనమివ్వనున్న మహానందీశ్వర స్వామి!