తూర్పు గోదావరి జిల్లా లింగవరం కాలనీలో ఓ యువకుడిపై దాడి జరిగింది. ఉదయం బహిర్భూమికి వెళ్లిన దుర్గా ప్రసాద్ అనే యువకునిపై గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడుతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అతనిపై ఎవరు ఎందుకు దాడి చేశారో అనేది తమకు తెలియదని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: