గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి ఆన్లైన్లో షాపింగ్ చేసి మోసపోయింది. లేటెస్ట్ వెరైటీ దుస్తుల కోసం ఆన్లైన్లో వెదుకుతుండగా.. ఓ వెబ్సైట్లో ఉంచిన ఫొటోలు బాధితురాలికి నచ్చాయి. ఈ క్రమంలో రెండు రకాల డ్రెస్సులు కావాలని కోరింది. ఫలితంగా ఒక్కొక్కటి వెయ్యి రూపాయల అవుతాయని వాట్సప్ ద్వారా సమాధానం వచ్చింది.
కొరియర్ ద్వారా..
ఈ నేపథ్యంలో క్యాష్ ఆన్ డెలివరీ విధానం ఎంపిక చేసుకోగా.. కొరియర్ ద్వారా పార్శిల్ వచ్చింది. డబ్బులు చెల్లించి పార్శిల్ తీసుకున్నారు. దాన్ని తెరిచి చూడగా పాత చీర కనిపించింది. వెంటనే కొరియర్ వాళ్లను సంప్రదిస్తే.. తమకు సంబంధం లేదని వెబ్సైట్ వాళ్లను అడగాలని సమాధానం ఇచ్చారు. వెబ్సైట్లో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసినా, వాట్సప్ చేసినా స్పందన లేదు. దీంతో మోసపోయామని బాధితురాలు గ్రహించారు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీల ద్వారా మాత్రమే ఆన్లైన్ కొనుగోళ్లు జరపాలని.. తెలియని వెబ్సైట్లు, వాట్సప్ ద్వారా షాపింగ్ చేస్తే ఇలా మోసపోయే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చూడండి : సెంటు భూమి పేరుతో 4 వేల కోట్లు దోచుకున్నారు: కాల్వ