ETV Bharat / jagte-raho

నమ్మిస్తాడు..లోబర్చుకుంటాడు..అందినకాడికి కాజేస్తాడు..!

author img

By

Published : Nov 12, 2020, 4:17 AM IST

అతని లక్ష్యం భర్తను కోల్పోయిన ఒంటరిగా ఉన్న మహిళలే.. వధువు కావాలంటూ మ్యాట్రిమోని సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఒంటరిగా అందంగా ఉన్న మహిళల వివరాలు సేకరిస్తాడు. వారికి ఫోన్ చేసి తియ్యని మాటలతో ఆకర్షిస్తాడు. శారీరక వాంఛ తీర్చుకున్నాక... నగదు డిమాండ్ చేస్తాడు. చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. ప్రవృత్తి మాత్రం మహిళలను మోసగించటం. ఇదే తరహాలో కృష్ణలంక పరిధిలో ఓ మహిళ నుంచి విడతల వారీగా 12 లక్షల రూపాయల నగదు వసూలు చేసిన జగదీష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురి మహిళలను ఇదేవిధంగా వేధించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

krishnalanka krishna district
krishnalanka krishna district

చదివింది బీటెక్‌.. చేసేది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. భర్తను కోల్పొయి, విడాకులు తీసుకుని రెండో పెళ్లికోసం మ్యాట్రిమోనిలో దరఖాస్తు చేసుకున్న ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటాడు. తియ్యని మాటలతో పరిచయం చేసుకుని.. నేరుగా ఇంటికి వెళ్లి మాటలతో ఆకర్షిస్తాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..శారీరకంగా లోబరుచుకుంటాడు. ఆపై లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నయ వంచకుడిని కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రూ.12.20లక్షలు వసూలు చేశాడు...

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన జగ్గవరపు ప్రదీప్‌కుమార్‌కు 2017లో వివాహం జరగ్గా.. 2019లో విడాకులు తీసుకున్నాడు. అనంతరం మ్యాట్రిమోని సైట్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. అందులో ఉండే అందమైన అమ్మాయిల ఫోటోలు, వివరాలను సేకరిస్తాడు. తనకు నచ్చిన అమ్మాయిలను చూసి.. వారికి వాట్సాప్, ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకుంటాడు. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన ఓ మహిళ రెండో వివాహం కోసం మ్యాట్రిమోని సైట్‌లో తన వివరాలు నమోదు చేసింది. ఆమెతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బాగా దగ్గరైన తర్వాత ప్రస్తుతం తన కుటుంబ పరిస్థితి బాగలేదని చెప్పాడు. అప్పుగా కొంత మొత్తం ఇస్తే.. కొద్ది రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ ఆమెను నమ్మించాడు. పలు దఫాలుగా ఆమె దగ్గర నుంచి రూ.12.20 లక్షలు వసూలు చేశాడు. ఆ మొత్తాన్ని మహిళ తిరిగి ఇవ్వాలని కోరడంతో.. తప్పించుకుని తిరగడం ప్రారంభించాడు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి ఆ యువతి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతని ఫోన్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉంటున్నట్టు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై కాకినాడ టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఇదే తరహా కేసు నమోదైందని తేలింది. దర్యాప్తులో భాగంగా ప్రదీప్‌కుమార్‌ ఫోన్‌తో పాటు.. అతని కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు ఇదే విధంగా పదుల సంఖ్యలో మహిళలను మోసం చేసినట్టు ప్రాథమికంగా నిర్థరణకు వచ్చారు. ఎవరికి దొరకకుండా ఉండేందుకు ఎప్పుడు కారులోనే తిరుగుతుంటాడు. తనకు కావాల్సిన సామగ్రి మొత్తం అందులోనే ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే అతను వాడే కారుకు కర్ణాటక, కేరళకు చెందిన రెండు నంబరు ప్లేట్లు వాడుతున్నట్లు’ పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

ఇదీ చదవండి

వైఎస్​ఆర్ నేతన్న నేస్తం నిధులు విడుదల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.