పోలవరంలో మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. కార్యాలయం బీరువాలో ఉంచిన రూ.51 లక్షలు అపహరణకు గురైంది. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నవీన్ మూర్తి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కార్యాలయ సిబ్బంది.. ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. అపహరణకు గురైన నగదు ప్రకాశం జిల్లాలో పట్టుబడింది. రూ.51 లక్షలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెక్యూరిటీ గార్డు మధుసూదనరెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
ఇదీ చదవండి: రాజధానిలో పెట్టింది ప్రజల సొమ్ము.. ఖజానాకు నష్టం కదా..: హైకోర్టు