గురువారం అర్ధరాత్రి సమయంలో గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామంలో పోలేరమ్మ జాతర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన.. కుంకుమ బండిలో ఉన్న ముగ్గురికి కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. బండిపై కొన్ని విద్యుత్ బల్బులు పనిచేయకపోవడంతో మరమ్మతులు చేసేందుకు పలువురు బండిపైకి ఎక్కారు. ఈ క్రమంలో కింద ఉన్న గ్రామస్థులు చూసుకోకుండా బండిని ముందుకు తీసుకెళ్లారు. పైనే ఉన్న విద్యుత్ తీగలు బండికి తగలడంతో గాలయ్య, సత్య, వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బండి ఒకవైపు పడిపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి:వాగులో ఇద్దరి మృతదేహాలు.. అంతటా అనుమానాలు