అనంతపురంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణంలోని ఆజాద్ నగర్‌కు చెందిన ఓ యువతిని(21) సాయంత్రం 4గంటల ప్రాంతంలో తెల్ల స్కార్ఫియో వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆమెకు డోన్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని బంధువులు తెలిపారు. అయితే యువతి గతంలో మరో అబ్బాయిని ప్రేమించినట్లు సమాచారం. అయితే ప్రేమించిన అబ్బాయే ఈ కిడ్నాప్ చేశాడా..? అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నాలుగో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి