ETV Bharat / international

చైనా నిఘా బెలూన్​ను కూల్చేసిన అమెరికా.. డ్రాగన్ గట్టి హెచ్చరిక - చైనా నిఘా బెలూన్​ పెంటగాన్​

అమెరికా గగనతలంలో సంచరిస్తున్న చైనా నిఘా బెలూన్​ను ఎట్టకేలకు పెంటగాన్​ కూల్చివేసింది. బెలూన్​ శిథిలాల్లో ఉన్న సున్నితమైన పరికరాలను స్వాధీనం చేసుకునేందుకు రికవరీ మిషన్​ను ప్రారంభించింది. మరోవైపు, తమ బెలూన్​ కూల్చివేయడంపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

US shoots down the Chinese surveillance balloon over the Atlantic Ocean
Etv BharatUS shoots down the US shoots down the Chinese surveillance balloon over the Atlantic Oceansurveillance balloon over the Atlantic Ocean
author img

By

Published : Feb 5, 2023, 7:43 AM IST

Updated : Feb 5, 2023, 8:23 AM IST

గగనతలంలో చక్కర్లు కొడుతూ తమ అణు స్థావరాలపై నిఘా పెట్టిన చైనా బెలూన్​ను అమెరికా కూల్చివేసింది. దక్షిణ కరోలీనా తీరానికి దగ్గర్లో దాన్ని కూల్చేసినట్టు పెంటగాన్ తెలిపింది. అట్లాంటిక్ సముద్రంలో పడిపోయిన బెలూన్ శిథిలాలను, అందులోని పరికరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు.. శనివారం మధ్యాహ్నం కూల్చివేత ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపింది. వర్జీనియాలోని లాంగ్లే ఎయిర్​ఫోర్స్ బేస్ నుంచి బయల్దేరిన ఓ ఫైటర్ ఎయిర్​క్రాఫ్ట్.. క్షిపణిని ప్రయోగించి బెలూన్​ను కూల్చివేసింది.

అమెరికా గగనతలంలో సంచరిస్తున్న చైనా నిఘా బెలూన్​ ఒక్కసారిగా కలకలం రేపింది. అదీ అణుస్థావరం వద్ద బెలూన్‌ సంచరించడం వల్ల అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. మొత్తం వ్యవహారాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ దృష్టికి పెంటగాన్​ తీసుకెళ్లింది. మొదట ఆ బెలూన్​ను కూల్చివేయడానికి అమెరికా కాస్త వెనకడుగు వేసినా.. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం ఆ చర్యను పూర్తి చేసింది. దక్షిణ కరోలీనా తీరానికి ఆరు కిలోమీటర్ల జరిగిన ఈ ఆపరేషన్​లో ఏ అమెరికన్​కూ హాని జరగలేదని స్పష్టం చేసింది. అమెరికా గగనతలంలోనే ఈ ఆపరేషన్ పూర్తైందని... తమ దేశ పరిధిలోని సముద్ర జలాల్లోనే శిథిలాలు పడిపోయాయని పెంటగాన్ వివరించింది. ఈ ఆపరేషన్​కు కెనడా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందని తెలిపింది.

అప్పుడే కూల్చేయమని చెప్పా: బైడెన్​
చైనా నిఘా బెలూన్​ కూల్చివేతపై అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. "పెంటగాన్​.. చైనా నిఘా బెలూన్​ గురించి బుధవారం వివరించింది. అప్పుడే త్వరగా కూల్చివేయమని ఆదేశించాను. కానీ ఎవరికీ ఎటువంటి నష్టం జరగకుండా కూల్చివేసేందుకు ప్రణాళికలు రూపొందించి ఆ పనిని శనివారం పూర్తిచేసింది" అని బైడెన్​ చెప్పారు.

చైనా హెచ్చరిక!
అమెరికా తమ బెలూన్​ను​ కూల్చివేయడంపై చైనా ఘాటుగా స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది తీవ్ర ఉల్లంఘనేనని ఆరోపించింది. దీనికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. గగనతలంలో బెలూన్​ సంచరించిన ఘటనను అమెరికా ప్రశాంతంగా, సంయమనంతో డీల్ చేయాలని చైనా కోరుకుంటున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ బెలూన్​ చైనా నుంచి వచ్చిన పౌర వైమానిక నౌక అని తెలిపింది.

మరో బెలూన్​ కూడా చైనాదేనా?
అయితే లాటిన్‌ అమెరికా ప్రాంతంలో గగనతలంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో బెలూన్‌ను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌.. శుక్రవారం ధ్రువీకరించింది. "ఒక బెలూన్ లాటిన్ అమెరికా దిశగా ప్రయాణిస్తున్నట్లు మేము గుర్తించాం. ఇది కూడా చైనా నిఘా బెలూన్‌గానే భావిస్తున్నాం" అని పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ తెలిపారు.

గూఢచర్య బెలూన్‌ అంటే?
ఓ పెద్ద బెలూన్‌కు సౌర శక్తితో పనిచేసే కెమెరా, రాడార్‌ లాంటి పరికరాలను బిగించి పక్క దేశాల మీదకి గూఢచర్యానికి పంపిస్తే దానినే స్పై బెలూన్‌ అని అంటారు. ఇవి సుమారు 80 వేల నుంచి 1.20 లక్షల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. వీటిని నేరుగా నియంత్రించలేరు. అయితే లక్ష్యం వైపు వీస్తున్న గాలికి అనుగుణంగా బెలూన్‌ ఎత్తును మార్చడం ద్వారా దాని దిశను మార్చేందుకు ప్రయత్నిస్తారు.

శాటిలైట్‌లు ఉండగా బెలూన్‌ ఎందుకో..
గూఢచర్యంలో శాటిలైట్‌లకున్న సామర్థ్యం ముందు బెలూన్‌లు దిగదుడుపే. అయితే ఇప్పుడు స్పై శాటిలైట్‌లను గుర్తించి, కూల్చేసే సాంకేతికత అందుబాటులో ఉంది. శత్రు దేశం వీటిని గుర్తించి కూల్చేస్తే ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనికి భిన్నంగా బెలూన్‌ల ప్రయోగానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకే మళ్లీ వీటిపై ఆసక్తి పెరుగుతోంది.

Last Updated : Feb 5, 2023, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.