ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్నప్పటి నుంచి కీలక పరణామాలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో ట్విట్టర్‌పై ఆరోపణలు చేస్తున్న మస్క్.. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశారంటూ ట్విట్టర్ లీగల్ సెల్ మాజీ అధిపతి విజయ గద్దెపై ఆరోపణలు గుప్పించారు. తాజాగా ది ఫ్రీ ప్రెస్ జర్నలిస్ట్ బారి వీస్‌తో కలిసి మరోసారి 'ట్విట్టర్ ఫైల్స్ 2'ను విడుదల చేశారు. అందులో ట్విట్టర్ ఉద్యోగులు కొన్ని బ్లాక్ లిస్టులను తయారు చేసి.. వాటిని కనిపించకుండా కట్టడి చేశారని ఆరోపించారు. ఈ ట్విట్టర్ ఫైల్స్ ద్వారా.. సంస్థ నిర్వహణపై పాత యాజమాన్యం చేసిన చట్టవిరుద్ధ పనులన్నీ వెలుగులోకి వస్తాయని తెలిపారు.
ఇంతకుముందు ట్విట్టర్‌లోని టీమ్‌లు.. కొన్ని బ్లాక్ లిస్టులు తయారు చేసి, వాటిని ట్రెండింగ్ నుంచి తీసేయడం, ఆ అకౌంట్లు అందరికీ కనపడకుండా చేయడం లాంటి పనులన్నీ ఖాతాదారులకు తెలియకుండా రహస్యంగా చేశారని ఆరోపించారు ది ఫ్రీ ప్రెస్‌కు చెందిన జర్నలిస్ట్ బారీ వీస్. ఈ కొత్త ట్విట్టర్ ఫైల్స్ దర్యాప్తు ద్వారా ఆ విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.
-
THREAD: THE TWITTER FILES PART TWO.
— Bari Weiss (@bariweiss) December 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
TWITTER’S SECRET BLACKLISTS.
">THREAD: THE TWITTER FILES PART TWO.
— Bari Weiss (@bariweiss) December 9, 2022
TWITTER’S SECRET BLACKLISTS.THREAD: THE TWITTER FILES PART TWO.
— Bari Weiss (@bariweiss) December 9, 2022
TWITTER’S SECRET BLACKLISTS.
"ట్విట్టర్.. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలు, సమాచారాన్ని తక్షణమే, ఏ అడ్డంకులు లేకుండా పంచుకునేందుకు వీలుగా ఉండేది. కాలక్రమేణా అందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇంతకుముందు ట్విట్టర్లో ఉన్న ఉద్యోగులు.. పక్షపాత ధోరణితో కొన్ని అకౌంట్లను టార్గెట్ చేసుకున్నారు. 'విజిబిలిటీ ఫిల్టరింగ్' అనే పవర్ ఫుల్ టూల్‌తో.. టార్గెట్‌గా చేసుకున్న ట్వీట్లు సెర్చ్‌లో కనిపించకుండా వాటి పరిధిని తగ్గించారు".
"ట్విట్టర్‌కు వ్యూహాత్మక స్పందన బృందం(స్ట్రాటజిక్ రెస్పాన్స్ టీమ్)ఉంటుంది. అది రోజుకు 200 సెలెక్ట్ చేసుకున్న అకౌంట్లను నియంత్రిస్తుంది. కానీ ఈ 200 సంఖ్యను దాటి అకౌంట్లను పాత యాజమాన్యం నియంత్రించింది. అలా పేపర్ల మీద ఉన్న కంపెనీ పాలసీలను(Site Integrity Policy, Policy Escalation Support SIP-PES) వారు ఉల్లంఘించారు. ఈ రహస్య బృందంలో మాజీ లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, సంస్థ ట్రస్ట్ అండ్ సేఫ్టీ గ్లోబల్ హెడ్ యోయెల్ రోత్, సీఈఓలు జాక్ డోర్సీ, పరాగ్ అగర్వాల్ తదితరులు ఉన్నారు.
ఈ బృందమే సున్నితమైన, కంపెనీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఓ ట్విట్టర్ ఉద్యోగి చెప్పారు" అని వీస్ పేర్కొన్నారు.
-
The Twitter Files, Part Deux!! 🍿🍿 https://t.co/bH9UiTSEK2
— Elon Musk (@elonmusk) December 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Twitter Files, Part Deux!! 🍿🍿 https://t.co/bH9UiTSEK2
— Elon Musk (@elonmusk) December 9, 2022The Twitter Files, Part Deux!! 🍿🍿 https://t.co/bH9UiTSEK2
— Elon Musk (@elonmusk) December 9, 2022
ట్విట్టర్ పవర్ ఫుల్ టూల్ 'వీఎఫ్'...
వీఎఫ్ అంటే ఖాతాలు కనిపించకుండా నియంత్రించే ట్విట్టర్ టూల్. ఇది వ్యక్తిగత ఖాతాదారుల సెర్చ్‌ను బ్లాక్ చేస్తుంది. ఒక ట్వీట్ కనిపించకుండా చేస్తుంది. సెలెక్ట్ చేసుకున్న కొందరు వ్యక్తులను.. ట్రెండింగ్ పేజీలో కనబడకుండా చేస్తుంది. హ్యాష్ట్యాగ్లోంచి కూడా తీసేస్తుంది.
ట్విట్టర్ ఫైల్స్ పార్ట్ 1 ఇదే..
ఇటీవల స్వతంత్ర జర్నలిస్తు మాట్ తైబీతో కలిసి ఎలాన్ మస్క్.. పాత యాజమాన్యం రహస్యంగా చేసిన కొన్ని చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై 'ట్విట్టర్ ఫైల్స్' అనే శీర్షికతో వివరాలను విడుదల చేశారు. అందులో 2020 ఎన్నికల సమయంలో జో బైడెన్ టీమ్‌తో విజయ గద్దె జరిపిన సంభాషణలకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ బయటపెట్టారు. జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన విషయం ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు.
'హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్' అంశంపై సెన్సార్షిప్ విధించడం వెనక విజయ గద్దె క్రియాశీలంగా పనిచేశారని స్వతంత్ర జర్నలిస్టు, రచయిత మాట్ తైబీ పేర్కొన్నారు.